సరికొత్త లవర్స్ | new lovers | Sakshi
Sakshi News home page

సరికొత్త లవర్స్

Feb 19 2014 11:06 PM | Updated on Sep 2 2017 3:52 AM

సరికొత్త లవర్స్

సరికొత్త లవర్స్

‘‘టైటిల్ చాలా బావుంది. క్లీన్ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తోంది. ఈ సినిమాతో మారుతిపై ఉన్న బూతు బ్రాండ్ పోతుందనుకుంటున్నాను’’ అని నితిన్ చెప్పారు.

 ‘‘టైటిల్ చాలా బావుంది. క్లీన్ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తోంది. ఈ సినిమాతో మారుతిపై ఉన్న బూతు బ్రాండ్ పోతుందనుకుంటున్నాను’’ అని నితిన్ చెప్పారు. సుమంత్ అశ్విన్, నందిత జంటగా హరి దర్శకత్వంలో మారుతి సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు నిర్మిస్తోన్న ‘లవర్స్’ టీజర్ ఆవిష్కరణ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. టీజర్‌ను నితిన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ -‘‘రషెస్ చూశాను. చాలా సరదాగా వచ్చింది. ‘ప్రేమకథా చిత్రమ్’ కంటే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు. కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, షూటింగ్ టైమ్‌లోనూ అంతే ఎంజాయ్ చేశానని సుమంత్ అశ్విన్ తెలిపారు.
 
  ఇందులో తనది చాలా మంచి పాత్ర అని నందిత చెప్పారు. సంగీత దర్శకుడు జె.బి., దర్శక నిర్మాతలు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మల్హార్‌భట్ జోషి.
 

Advertisement
 
Advertisement
Advertisement