మహేష్ కోసం.. మరో డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌ | New Backdrop For Mahesh Babu And Sukumar Film | Sakshi
Sakshi News home page

Jan 23 2019 12:10 PM | Updated on Jan 23 2019 1:44 PM

New Backdrop For Mahesh Babu And Sukumar Film - Sakshi

రంగస్థలం సినిమాతో రికార్డ్‌లను తిరగరాసిన దర్శకుడు సుకుమార్‌ తన తదుపరి చిత్రాన్ని సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సూపర్‌ స్టార్.. నెక్ట్స్ సుకుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. రంగస్థలం సినిమాను పిరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కించిన సుక్కు.. మహేష్ కోసం మరో డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌ను రెడీ చేస్తున్నాడట.

సుకుమార్‌, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా, ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కనుందట. రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్‌ను డిఫరెంట్‌ లుక్‌లో చూపించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్‌ను, రంగస్థలంలో రామ్‌ చరణ్‌ను గడ్డంతో చూపించిన సుక్కు మహేష్‌తో కూడా అదే లుక్‌ ట్రై చేయిస్తాడన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement