సోష‌ల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన ప్ర‌ముఖ సింగ‌ర్‌

Neha Kakkar Takes Break From Social Media To Stay Away From Nepotism - Sakshi

ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం అనంత‌రం బాలీవుడ్‌లోని సినీ వార‌సుల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇండ‌స్ట్రీలో నెపోటిజ‌మ్ కార‌ణంగానే ప్ర‌తిభా‌వంతులైన న‌టులు అవ‌కాశాలు కోల్పోతున్నార‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో స్టార్ కిడ్స్‌ను టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో వారిని ట్రోల్ చేస్తున్నారు. అలాగే  స్టార్ వార‌సుల‌ను అన్‌ఫాలో చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు స్టార్ హీరోల వార‌సులు త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్‌ల‌ను తొల‌గిస్తున్నారు. మ‌రికొంత మంది నెగెటివిటీకి దూరంగా ఉండేందుకు కామెంట్ బాక్స్‌ను డిసెబుల్ చేస్తున్నారు. (సుశాంత్ మరణంపై డబ్బు సంపాదించడం భావ్యమా!)

నెటిజ‌న్ల నుంచి వ‌స్తున్న బంధుప్రీతి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోలేక గ‌త‌వారం సోనాక్షి సిన్హా త‌న ట్విట‌ర్ ఖాతా నుంచి వైదొలుగుత‌న్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అలాగే మ‌రో స్టార్ కిడ్ సోన‌మ్ క‌పూర్‌పై సైతం ట్రోల్ చేయ‌గా ఆమె త‌న కామెంట్ సెక్ష‌న్‌ను ఆఫ్ చేశారు. తాజాగా బాలీవుడ్ సింగ‌ర్‌ నేహా క‌క్క‌ర్ కొద్ది రోజుల‌పాటు సోష‌ల్ మీడియాకు విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ద్వేషం, బంధుప్రీతి, అసూయ నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన హీరోయిన్)

'నేను తిరిగి నిద్రలోకి వెళుతున్నాను. ప్రపంచం మంచిగా మారిన‌ప్పుడు నన్ను మేల్కొల్పండి. ద్వేషం, నెపోటిజం, అసూయ, తీర్పులు, హిట్లర్లు, హత్యలు, ఆత్మహత్యలు, చెడ్డ వ్యక్తులు ఉన్న ప్ర‌పంచం కాదు. స్వేచ్ఛ‌, ప్రేమ, గౌరవం, వినోదం, మంచి వ్యక్తులు ఉన్న ప్రపంచం కావాలి. గుడ్‌నైట్‌. భ‌య‌ప‌డ‌కండి. నేను చనిపోవ‌డం లేదు. కేవ‌లం కొన్ని రోజులు దూరంగా వెళుతున్నా అంతే'.. అంటూ నేహా తన పోస్ట్ లో పేర్కొన్నారు. (ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నా: క్రికెటర్‌)

'నా నిర్ణ‌యం ఎవరికైనా చెడుగా అనిపిస్తే న‌న్ను క్షమించండి! ఇది నేను చాల రోజుల నుంచి అనుభ‌విస్తున్నాను. కానీ ఎవ‌రికి చెప్పుకోలేక‌పోతున్నాను. కేవ‌లం న‌న్ను నేను సంతోషంగా ఉంచుకునేందుకు ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాను. చాలా కాలం నుండి నేను అనుభూతి చెందుతున్నాను కాని చెప్పలేకపోతున్నాను, సంతోషంగా ఉండటానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేనూ మ‌నిషినే. ఇది న‌న్ను చాలా బాధ‌పెడుతోంది. నా గురించి ఆందోళ‌‌న చెంద‌కండి. నేను బాగానే ఉన్నాను'.. అంటూ ఉద్వేగానికి లోన‌య్యారు. కాగా సినిమాల్లోని కాకుండా సంగీత ప‌రిశ్ర‌మ‌లోనూ పెద్ద మాఫియా ఉంద‌ని, కొంద‌రు ప్ర‌ముఖుల కార‌ణంగా కొత్త వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని  గాయ‌కుడు సోనూ నిగ‌మ్ వీడియోను షేర్ చేసిన విష‌యం తెలిసిందే. దీని అనంత‌రం సంగీత ప‌రిశ్ర‌మ‌లో కూడా నెపోటిజ‌మ్ వివాదంలో చిక్కుకుంది. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top