కె.జె. యేసుదాసుపై మండిపడ్డ బాలీవుడ్ నటి | Neha Dhupia slams Yesudas' remarks against girls wearing jeans | Sakshi
Sakshi News home page

కె.జె. యేసుదాసుపై మండిపడ్డ బాలీవుడ్ నటి

Oct 5 2014 11:35 PM | Updated on Sep 2 2017 2:23 PM

కె.జె. యేసుదాసుపై మండిపడ్డ బాలీవుడ్ నటి

కె.జె. యేసుదాసుపై మండిపడ్డ బాలీవుడ్ నటి

మహిళల వస్త్రధారణకు సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాసుపై బాలీవుడ్ నటి నేహా ధూపియా మండిపడ్డారు.

ఇండోర్:మహిళల వస్త్రధారణకు సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాసుపై బాలీవుడ్ నటి నేహా ధూపియా మండిపడ్డారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలతో మహిళలను తక్కువ చేసినట్లేనని ఆమె విమర్శించారు.' ఇది నిజంగా దురదృష్టం. మహిళలు ఏది ధరించాలి. ఏది ధరించకూడదు' అని పేర్కొనడం సమాజానికే సిగ్గు చేటన్నారు. దేశం పురోగమనం సాధిస్తున్న దశలో ఈ వ్యాఖ్యలు ప్రముఖ స్థానంలో వ్యక్తి చేయడం బాధాకరమన్నారు. '21 టోపాన్ కీ సలామీ' చిత్ర ప్రమోషన్ కార్యక్రమానికి విచ్చేసిన నేహా ఈ వ్యాఖ్యలు చేశారు.
 

గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు జీన్స్ ధరించడాన్ని యేసుదాసు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. జీన్స్ ధరించడం భారత సంస్కృతికి విరుద్ధమని, మహిళలు జీన్స్ ధరించడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని సూచించారు. నిరాడంబరత్వం, మంచితనం భారత మహిళల్లోని గొప్ప లక్షణాలని, వారు జీన్స్ ధరించడం భారత సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement