నకిలీ బ్రిట్నీ కావలెను! | need duplicate Britney Spears | Sakshi
Sakshi News home page

నకిలీ బ్రిట్నీ కావలెను!

Nov 20 2013 1:31 AM | Updated on Sep 2 2017 12:46 AM

నకిలీ బ్రిట్నీ కావలెను!

నకిలీ బ్రిట్నీ కావలెను!

ఏ యాంగిల్లో చూసినా అందంగా ఉండేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో పాప్‌స్టార్ బ్రిట్నీ స్పియర్స్ కచ్చితంగా ఉంటారు.

ఏ యాంగిల్లో చూసినా అందంగా ఉండేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో పాప్‌స్టార్ బ్రిట్నీ స్పియర్స్ కచ్చితంగా ఉంటారు. ఈ అందగత్తెకు ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు బ్రిట్నీ రూపొందించే సరికొత్త మ్యూజిక్ ఆల్బమ్స్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం  ఓ మ్యూజిక్ వీడియో తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బ్రిట్నీ. ఈ వీడియోలోని కొన్ని సన్నివేశాల్లో తనలా ఉన్న అమ్మాయిని నటింపజేయాలనుకుంటున్నారామె. నకిలీ బ్రిట్నీని వెతకడం కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి, ఓ ఆంగ్ల పత్రిక ద్వారా తన శరీర కొలతల్ని బయటపెట్టారు బ్రిట్ని. 
 
 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, శరీర కొలతలు 32-27-35, డ్రెస్ సైజ్ 4, షూ సైజ్ 7 ఉంటే చాలు.... నకిలీ బ్రిట్నీగా పనికొస్తారట. ఒకవేళ సేమ్ టు సేమ్ ఈ కొలతలు లేకపోయినా.... కొంచెం దగ్గరగా ఉన్నా చాలు, సర్దుకుపోదాం అంటున్నారు బ్రిట్నీ. ఈ ప్రకటన ఇలా వెలువడిందో లేదో ఈ కొలతలు ఉన్న ఆడవాళ్లు... దరఖాస్తుతో రెడీ అయ్యి, బ్రిట్నీ ఆఫీసు ముందు గుమిగూడారట. వీళ్లల్లో బ్రిట్నీకి డూప్‌గా నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో వాళ్లు ఆనందపడతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నకిలీ బ్రిట్నీగా నటించడానికి అమ్మాయిలు పోటీపడుతుంటే, అబ్బాయిల్లో బ్రిట్నీ అభిమానులు మాత్రం ఆమె కొలతలు తెలిసినందుకు పరమానందపడిపోతున్నారట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement