‘ఆషికి-2’ కంటే బాగా వచ్చింది | Nee Jathaga Nenundali team celebrates Platinum | Sakshi
Sakshi News home page

‘ఆషికి-2’ కంటే బాగా వచ్చింది

Aug 20 2014 11:36 PM | Updated on Sep 2 2017 12:10 PM

‘ఆషికి-2’ కంటే బాగా వచ్చింది

‘ఆషికి-2’ కంటే బాగా వచ్చింది

హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషికి 2’ తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల

హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషికి 2’ తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో చేశారు. ఈ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ హిందీలోకన్నా తెలుగులో బాగా వచ్చిందని గణేశ్ అన్నారు. పాటలు ఘనవిజయం సాధించడానికి స్వరాలతో పాటు సాహిత్యం కారణమని, మంచి ఫీల్ ఉన్న చిత్రమనీ సచిన్ తెలిపారు. ఈ సినిమా తనకు ప్రత్యేకమని నజియా అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement