నయన్ కనిపించటం లేదు..! | Nayanthara Babu bangaram promotion | Sakshi
Sakshi News home page

నయన్ కనిపించటం లేదు..!

Aug 11 2016 9:15 AM | Updated on Sep 4 2017 8:52 AM

నయన్ కనిపించటం లేదు..!

నయన్ కనిపించటం లేదు..!

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న నయనతార, వివాదాలతో వార్తలో నిలుస్తోంది. ఇప్పటికే బాబు బంగారం యూనిట్తో గొడవపడి ఓ పాట షూటింగ్కు రాలేందన్న వార్తలతో టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. యూనిట్ సభ్యులు...

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న నయనతార, వివాదాలతో వార్తలో నిలుస్తోంది. ఇప్పటికే బాబు బంగారం యూనిట్తో గొడవపడి ఓ పాట షూటింగ్కు రాలేందన్న వార్తలతో టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. యూనిట్ సభ్యులు అలాంటిదేమి లేదని కొట్టి పారేసినా.. గుసగుసలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి నయనతార పేరు ఫిలిం నగర్లో ప్రముఖంగా వినిపిస్తోంది.

ఈ శుక్రవారం రిలీజ్కు రెడీ అవుతున్న బాబు బంగారం సినిమా ప్రమోషన్లో ఇంత వరకు నయనతార కనిపించలేదు. వెంకటేష్ లాంటి స్టార్ హీరో కూడా స్పెషల్ ఇంటర్వూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తుంటే.., నయనతార మాత్రం కనిపించటం లేదు. బాబు బంగారం యూనిట్తో వచ్చిన వివాదాల కారణంగానే నయనతార ప్రమోషన్కు దూరంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో దాసరి లాంటి సినీ ప్రముఖులు హీరోయిన్లు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకపోవటంపై ఘూటుగానే స్పందించారు. అయినా మన హీరోయిన్ల తీరులో మాత్రం మార్పు రాలేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Advertisement
 
Advertisement
Advertisement