‘ఊరంతా అనుకుంటున్నారు..!’ ఫస్ట్‌లుక్‌ | Nawin Vk next film Ooranthaa anukuntunnaaru | Sakshi
Sakshi News home page

Jan 16 2018 12:57 PM | Updated on Jan 16 2018 1:15 PM

Nawin Vk next film Ooranthaa anukuntunnaaru - Sakshi

సీనియర్ నటుడు నరేష్‌ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన హీరో నవీన్‌ కృష్ణ విజయ్‌. నందిని నర్సింగ్‌ హోమ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్‌ త్వరలో మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు నవీన్‌. ‘అమ్మానాన్న నాకు నడక నేర్పారు.. నడవడికను మా ఊరు నాకు నేర్పింది.. రామాపురం.. మరి మా కథ ఏంటో చూద్దామా.. నా రాబోయే చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’’ అంటూ ఆ సినిమా టైటిల్‌ లోగోను ఆసక్తికరంగా విడుదల చేశారు.

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన రైతు కుటుబం సినిమాలోని ఊరంతా అనుకుంటున్నారు పాట పల్లవితో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్‌, మేఘా చౌదరి, సోఫియా సింగ్‌, జయసుధ, రావూ రమేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతో పాటు తండ్రి నరేష్‌(సీనియర్‌)తో కలిసి విఠలాచార్య సినిమాలో నటిస్తున్నాడు నవీన్‌.

Advertisement
 
Advertisement
Advertisement