ధృవ సినిమాలో మరో హీరో | navadeep in ram charans dhruva | Sakshi
Sakshi News home page

ధృవ సినిమాలో మరో హీరో

Jun 7 2016 1:37 PM | Updated on Sep 4 2017 1:55 AM

ధృవ సినిమాలో మరో హీరో

ధృవ సినిమాలో మరో హీరో

బ్రూస్ లీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నా.. చరణ్ మాత్రం...

బ్రూస్ లీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నా.. చరణ్ మాత్రం మూడో షెడ్యూల్  నుంచే షూటింగ్లో పాల్గొంటున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ కాస్టింగ్ను సెట్ చేస్తున్నారు.

చరణ్ సరసన హీరోయిన్గా మరోసారి రకుల్ ప్రీత్ కనిపిస్తుండగా, తమిళ వర్షన్లో విలన్గా నటించిన అరవింద్ స్వామి, చరణ్ తోనూ ఢీ అంటున్నాడు. చరణ్ షూటింగ్లో పాల్గొంటున్న తాజా షెడ్యూల్లో యువ నటుడు నవదీప్ కూడా ధృవ టీంతో జాయిన్ అవుతున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్న నవదీప్, తన పాత్ర ఏంటి అన్నది మాత్రం రివీల్ చేయలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement