తండ్రీ, కొడుకులు లీడ్ రోల్స్లో 'విఠలాచార్య' | Naresh Nawin Vitalacharya Movie Launched | Sakshi
Sakshi News home page

తండ్రీ, కొడుకులు లీడ్ రోల్స్లో 'విఠలాచార్య'

Jun 15 2017 10:39 AM | Updated on Sep 5 2017 1:42 PM

తండ్రీ, కొడుకులు లీడ్ రోల్స్లో 'విఠలాచార్య'

తండ్రీ, కొడుకులు లీడ్ రోల్స్లో 'విఠలాచార్య'

కామెడీ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నరేష్, తన వారసుడ్ని

కామెడీ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నరేష్, తన వారసుడ్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ తొలి సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించాడు.

తాజాగా తన రెండో సినిమాను ప్రారంభించాడు నవీన్. నవీన్తో పాటు నరేష్ కూడా లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు విఠలాచార్య అనే ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు. తండ్రి కొడుకుల అనుబంధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సుహాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనీషా ఆంబ్రోస్ నవీన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement