మైలురాయి లాంటి సినిమా | Nara Rohit's 'Rowdy Fellow' on Nov 21st | Sakshi
Sakshi News home page

మైలురాయి లాంటి సినిమా

Oct 31 2014 11:45 PM | Updated on Aug 29 2018 3:53 PM

మైలురాయి లాంటి సినిమా - Sakshi

మైలురాయి లాంటి సినిమా

నారా రోహిత్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘రౌడీఫెలో’. విశాఖసింగ్ కథానాయిక. గీత రచయిత కృష్ణచైతన్యను దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మాత ప్రకాశ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 నారా రోహిత్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘రౌడీఫెలో’. విశాఖసింగ్ కథానాయిక. గీత రచయిత కృష్ణచైతన్యను దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మాత ప్రకాశ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. కొత్తదనాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. గోవాలో హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ‘ఆ సీతాదేవి నవ్వులా...’ పాటతో పాటు ‘ఎంతవారు గానీ..’ అనే పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తయింది’’ అని తెలిపారు.

 ‘‘రచయిత దర్శకుడైతే సినిమాను ఎంత అందంగా, నిజాయతీగా తెరకెక్కిస్తాడో ‘రౌడీఫెలో’ చిత్రం నిరూపిస్తుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రానికి వాణిజ్య విలువలు మేళవించి అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు కృష్ణచైతన్య. ఈ సినిమాతో అతను అగ్ర దర్శకుల జాబితాలో చేరతాడు. అతను రాసిన సంభాషణలు అందరినీ ఆకట్టుకుంటాయి. రోహిత్ కెరీర్‌కి ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అని సహ నిర్మాత సందీప్ కొరిటాల నమ్మకం వెలిబుచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement