నారా రోహిత్‌-శిరీష పెళ్లి సందడి: హల్దీ వీడియో చూశారా? | Tollywood Actor Nara Rohit, Sireesha Haldi Faunction Video Out Now | Sakshi
Sakshi News home page

పెండ్లి పనులు షురూ.. నారా రోహిత్‌-శిరీష హల్దీ వీడియో

Oct 26 2025 11:10 AM | Updated on Oct 26 2025 1:22 PM

Tollywood Actor Nara Rohit, Sireesha Haldi Faunction Video Out Now

తెలుగు హీరో నారా రోహిత్‌ (Nara Rohit) పెండ్లిపనులు షురూ అయ్యాయి. పెళ్లికూతురు శిరీష (Siree Lella) ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఇటీవలే జరిగింది. తాజాగా రోహిత్‌- శిరీషలు జంటగా హల్దీ ఫంక్షన్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఆటలు, పాటలతో ఈ సెలబ్రేషన్స్‌ రెట్టింపు ఉత్సాహంతో సాగాయి. రోహిత్‌- శిరీష అక్టోబర్‌ 30న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

అలా మొదలైంది
‍నారా రోహిత్‌ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష హీరోయిన్‌గా నటించింది. రోహిత్‌ ప్రియురాలిగా మెప్పించింది. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ అతడితో ప్రేమలో పడింది. అదే విషయాన్ని ఇంట్లో చెప్పగా.. ఇరు కుటుంబాలు పెళ్లికి పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

సినీ జర్నీ
నారా రోహిత్‌ విషయానికి వస్తే.. బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సోలో సినిమాతో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోయాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్‌ తీసుకుని ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో అలరించాడు.

 

చదవండి: అల్లు అరవింద్‌ తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement