టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ మధ్య జీవితమంతా అల్లు అర్జున్‌కు కాపలా కాయడమే సరిపోయింది, ఇంకా లవ్‌స్టోరీలకు ఛాన్స్ ఎక్కడిది? అన్నాడు. ఆ తర్వాత తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని.. తనపై చేస్తున్న కుట్రలన్నీ వెంట్రుకతో సమానం అంటూ మిత్రమండలి ఈవెంట్‌లో ఓ బూతు మాట కూడా అనేశాడు. ఈ కామెంట్స్‌పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది.
ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్‌లో బన్నీ వాసు
ఇలా హద్దులు దాటి మాట్లాడినందుకు అల్లు అరవింద్ (Allu Aravind).. బన్నీ వాసుకు గట్టిగానే క్లాస్ పీకాడట! ఈ విషయాన్ని బన్నీ వాసు స్వయంగా వెల్లడించాడు. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం జరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాసు వచ్చాడు. ఆయన మైక్ అందుకుని ప్రసంగం ప్రారంభించేలోపే.. నిర్మాత ఎస్‌కేఎన్ కలగజేసుకుని ఇప్పుడు బన్నీ ఒక అగ్రెసివ్ స్పీచ్ ఇస్తాడన్నాడు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని..
దీంతో అప్పటికే జ్ఞానోదయం అయిన బన్నీ వాస్.. అగ్రెసివ్ లేదు, కాంట్రవర్సీ లేదు. ఇప్పుడు కూల్‌గానే మాట్లాడతాను. ఎందుకంటే ఆ కాంట్రవర్సీకి ఆయన (అల్లు అరవింద్) తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు. అందుకే ఈరోజు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. వైరల్ కంటెంట్ ఇవ్వమంటారు.. మళ్లీ ఆయనే వైరు పట్టుకుని కొడతారు. ఇంకో నాలుగైదు నెలలు వైరల్ కంటెంట్‌కు ఛాన్సే లేదు అంటూ సరదాగా అనడంతో అంతా నవ్వేశారు.
చదవండి: బాడీ షేమింగ్, తిట్లు.. ఇదేం బుద్ధి? సంజన, మాధురికి గడ్డిపెట్టిన నాగ్


