‘ఆటగాళ్లు’ మొదలు పెట్టారు..! | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 13 2017 12:49 PM

 nara rohith jagapati babu movie shooting Begins today - Sakshi

విలన్ గా మారిన తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సీనియర్ స్టార్ జగపతి బాబు, త్వరలో ఓ మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముం‍దుకు రానున్నాడు. విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నారా రోహిత్ తో కలిసి ఆటగాళ్లు అనే మల్టీ స‍్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ యాక్షన్ జానర్ లో రూపొందుతోంది.

ప్రారంభమైంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం మొదలైంది. ఇప‍్పటికే ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా తెరకెక్కుతుందంటున్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
 
Advertisement