అదే గెటప్లో.. నాలుగోసారి..! | nara rohit to play Cop again for his next | Sakshi
Sakshi News home page

అదే గెటప్లో.. నాలుగోసారి..!

Sep 29 2016 11:12 AM | Updated on Sep 4 2017 3:31 PM

అదే గెటప్లో.. నాలుగోసారి..!

అదే గెటప్లో.. నాలుగోసారి..!

రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా ఆసక్తికర కథలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే బాటలో నడుస్తున్న రోహిత్.. ఎక్కువగా సీరియస్ పాత్రల్లోనే కనిపించాడు. అది కూడా ఎక్కువగా...

రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా ఆసక్తికర కథలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే బాటలో నడుస్తున్న రోహిత్.. ఎక్కువగా సీరియస్ పాత్రల్లోనే కనిపించాడు. అది కూడా ఎక్కువగా పోలీస్ గెటప్లోనే. ఇప్పటికే మూడు సినిమాల్లో పోలీస్ డ్రస్ వేసుకున్న రోహిత్ ఇప్పుడు మరోసారి అదే గెటప్లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు.

తొలి సినిమా బాణంలో పోలీస్ ఆఫీసర్గా కనిపించిన నారా రోహిత్ తరువాత రౌడీఫెలో, అసుర సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో మరోసారి పోలీస్ గెటప్లో కనిపించనున్నాడు. గతంలో రోహిత్ పోలీస్గా నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించగా మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement