నిర్మాతగా... | Nara Rohit now turns producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా...

Jan 29 2015 11:41 PM | Updated on Aug 29 2018 3:53 PM

నిర్మాతగా... - Sakshi

నిర్మాతగా...

‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’ తదితర చిత్రాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ నిర్మాతగా మారుతున్నారు.

‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’ తదితర చిత్రాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ నిర్మాతగా మారుతున్నారు. సతీశ్ దేవినేని చెప్పిన కథ నచ్చడంతో ఆయన్ను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ - ‘‘సతీశ్ చెప్పిన కథ విని, ఉద్వేగానికి గురయ్యా. అందుకే ఈ చిత్రాన్ని నేనే నిర్మించాలనుకున్నా. యూత్, ఫ్యామిలీస్, క్లాస్, మాస్.. ఇలా అందరూ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘పండగలా వచ్చాడు’, ‘అసుర’ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నానని రోహిత్ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement