చంద్రబాబు మనవడి సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ..? | Nara Devansh In Balakrishna NTR Biopic | Sakshi
Sakshi News home page

Apr 24 2018 11:42 AM | Updated on Aug 29 2018 1:59 PM

Nara Devansh In Balakrishna NTR Biopic - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్టీఆర్‌. సీనియర్ ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇతర పాత్రలకు కూడా నందమూరి హీరోలనే తీసుకునే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

ఎన్టీఆర్‌ చిన్నతనానికి సంబంధించిన సన్నివేశాల్లో బాల ఎన్టీఆర్‌గా నారా లోకేష్‌, బ్రాహ్మణీల కుమారుడు దేవాన్ష్‌ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మరికొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌గా కళ్యాణ్ రామ్‌ తనయుడు శౌర్యారామ్‌, నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్‌ నటించనున్నారు. ఇక యంగ్ ఎన్టీఆర్‌గా బాలయ్య తనయుడు మోక్షజ్ఞను తీసుకోవాలని భావించినా బాలకృష్ణ వద్దన్నారని తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ కథానాయకుడు శర్వానంద్‌ మరోకీలక పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement