నాని చేతుల మీదుగా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌!

Nani Will Announce Aadhi Pinisetty Movie Title On 24th May - Sakshi

కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌పై నాని, ఆది పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నుకోరి’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ల నటనకు ప్రశంసలు దక్కాయి. మళ్లీ కోన వెంకట్‌ ఆది పినిశెట్టితో కలిసి మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను నాని చేతుల మీదుగా రిలీజ్‌ చేయించనున్నారు చిత్రయూనిట్‌. మే 24న 11 గంటల 11 నిమిషాలకు ఈ మూవీ టైటిల్‌ను నాని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ఆదికి జోడిగా తాప్సీ, రితికా సింగ్‌ నటించనున్నారు. ‘లవర్స్‌’ ఫేమ్‌ హరి దర్శత్వంలో  ఎమ్‌వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్‌ తన కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  హీరో, విలన్, పాజిటివ్‌ క్యారెక్టర్‌.. ఏదైనా సరే తన నటనతో ఆకట్టుకునే ఆది ఈ సినిమాలో అంధుడిగా నటిస్తున్నట్లు సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top