నాలుగేళ్ల తర్వాత...

Nani teams up with Ritu Varma tieup after four years - Sakshi

‘నిన్ను కోరి’ వంటి హిట్‌ తర్వాత మళ్లీ హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు అంటే? ‘పెళ్ళి చూపులు’ ఫేమ్‌ రీతూవర్మ. ‘ఎవడే సుబ్రమణ్యం’లో నాని ప్రేయసిగా రీతూవర్మ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ నాలుగేళ్లకు ఇద్దరూ జంటగా నటించబోతున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెలలో లాంఛనంగా ప్రారంభం కానుంది. జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తామని చిత్రబృందం పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top