మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ : నాని

Nani Press Meet On Gang Leader Success - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియాంక అరుళ్ మోహన్‌  హీరోయిన్‌. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 13న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అయ్యి ఆడియన్స్‌ నుండి సూపర్‌ రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తుంది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘నేను లోకల్‌ సినిమాలో ఒక డైలాగ్‌ ఉంది. ‘ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు’ అని ఆ డైలాగ్‌ ఎడిటింగ్‌లో తీసేశాం కానీ ఇప్పుడు వాడాలనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్‌ రోజు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్‌ అలా పైకి వెళ్ళింది. ఈరోజు మార్నింగ్‌ షోస్‌ ఇంకా స్ట్రాంగ్‌గా స్టార్ట్‌ అయ్యాయి. ఇప్పటిదాకా మేము మాట్లాడాము ఇకనుండి సినిమా మాట్లాడుతుంది. గ్యాంగ్‌లీడర్‌ సినిమాను ఇంతలా ఓన్‌ చేసుకొని ఇంత మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌.

సినిమా రిలీజైనప్పటి నుంచి సోషల్‌ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ప్రతి ఒక్కరి పెర్ఫామెన్స్‌కి ఒక ఎమొర్టికన్‌ వాడుతున్నారు. ఇది ఒక నిజమైన గెలుపుగా భావిస్తున్నాం. ప్రతి రివ్యూలోను కార్తికేయ పెర్ఫామెన్స్‌ని, వెన్నెల కిషోర్‌ కామెడీని అంతగా మెచ్చుకుంటున్నారు. సినిమా రిలీజ్‌ అవ్వగానే ఒకటి నోటీస్‌ చేశాను ప్రియాంక అరుళ్ మోహన్‌ ఫ్యాన్‌ క్లబ్‌ను క్రియేట్‌ చేశారు. ఫస్ట్‌ డేనే ఫ్యాన్‌ క్లబ్‌ ఏర్పాటు చేయడం మంచి విషయం. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌కి మరో హిట్‌ పడింది అనే మెస్సేజ్‌ చూసి హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. మల్లికార్జున థియేటర్‌లో ఫ్యామిలీస్‌ సినిమాను ఎంతగా ఎంజాయ్‌ చేస్తున్నారు అనేది నా కజిన్‌ ఒక వీడియో క్లిప్‌ తీసి పంపింది. రిలీజ్‌ టెన్షన్ లేకుండా మాకు ఇంతటి పాజిటివిటీని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top