చూసిన వెంటనే షాకయ్యా : నాని | Nani Comment On Mehbooba Movie | Sakshi
Sakshi News home page

May 9 2018 6:52 PM | Updated on Mar 22 2019 1:53 PM

Nani Comment On Mehbooba Movie - Sakshi

ఒకప్పుడు డైనమిక్‌ డైరెక్టర్‌ ఎవరు అంటే పూరి జగన్నాథ్‌ మాత్రమే అని అనేవారు. స్టార్‌ డైరెక్టర్‌ హోదాలో చాలా కాలమే కొనసాగారు. కానీ ప్రస్తుతం పూరి సినిమాలు వస్తున్నాయంటే ఒకప్పటి హంగామా ఇప్పుడు ఉండటం లేదు. దానికి కారణం వరుసబెట్టి ఒకే మూసధోరణిలో సినిమాలు చేస్తుండటమే. అయితే ‘మెహబూబా’ మాత్రం పూర్తిగా తన పంథా మార్చి కొత్తగా ట్రై చేసిన సినిమా అంటూ చెప్తున్నాడు పూరి. 

ఆకాష్‌ పూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్‌ హైలెవల్లో చేస్తోంది చిత్రయూనిట్‌. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రమోషన్‌లో భాగంగా నాని ఈ సినిమా గురించి వివరిస్తూ ఒక వీడియోను రిలీజ్‌ చేశాడు. ‘ట్రైలర్‌ చూసిన వెంటనే షాకయ్యా. టెక్నికల్లి బ్రిలియంట్‌గా ఉంది. ఇదంతా ఎప్పుడు తీశారా అని డౌట్‌ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న క్యూరియాసిటీ పెరిగింది. చిత్రబృంధానికి,పూరి గారికి, ఆకాష్‌, ఛార్మి గారికి విష్‌ యూ ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇండో పాక్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

అనుభూతికి లోనయ్యా : కోన
ఇప్పుడే మెహబూబా సినిమా చూశాను. కాదు...కాదు...అనుభూతికి లోనయ్యాను. ప్రేమతో పూరి తీసిన గొప్ప ప్రేమకథ మెహబూబా. చిత్రబృంధానికి అభినందనలు అంటూ ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement