పవన్ను దాటేసిన యంగ్ హీరో..! | Nani Beats Pawan Kalyan record In overseas | Sakshi
Sakshi News home page

పవన్ను దాటేసిన యంగ్ హీరో..!

Jul 15 2017 3:15 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ను దాటేసిన యంగ్ హీరో..! - Sakshi

పవన్ను దాటేసిన యంగ్ హీరో..!

వరుస సక్సెస్లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని మరో ఘనత సాధించాడు. ఓవర్ సీస్లో నాలుగు మిలియన్

వరుస సక్సెస్లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని మరో ఘనత సాధించాడు. ఓవర్ సీస్లో నాలుగు మిలియన్ డాలర్ చిత్రాలు ఉన్న హీరోగా నిలిచాడు. ఇప్పటికే నాని హీరోగా తెరకెక్కిన ఈగ, భలే భలే మొగాడివోయ్, నేను లోకల్ సినిమాలు మిలియన్ డాలర్లు సాధించి సత్తా చాటాయి. తాజాగా నాని కొత్త సినిమా నిన్ను కోరి రెండు వారాల్లోనే మిలియన్ డాలర్ క్లబ్లో అడుగుపెట్టింది.

ఈ సినిమాతో ఓవర్ సీస్ నాలుగు మిలియన్ డాలర్ సినిమాల రికార్డ్ ఉన్న ఎన్టీఆర్ (బాద్షా, టెంపర్, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో) సరసన నిలిచాడు నాని. ఆ తరువాత స్థానంలో అత్తారింటికి దారేది, సర్థార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల సినిమాలతో పవన్ రెండో స్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement