
తన నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకునే నాచురల్ స్టార్ నాని.. గత రెండు సినిమాలతో ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం నాని క్రికెటర్‌గా చేస్తున్న జెర్సీ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే.. మరో డిఫరెంట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు.
మనం, 24, హలో లాంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం జరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళ సంగీత యువ సంచలనం అనిరుధ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 19 నుంచి జరుగనున్నట్లు తెలిపారు.