మన న్యాచురల్ స్టార్ నాని రచయితగా మారారు. అదీ గ్యాంగ్ లీడర్ చిత్రం కోసమనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు భిన్న పాత్రలను చేస్తూ వచ్చిన నాని.. ఈ మూవీలో రచయితగా మారిపోయాడు. అలాంటప్పుడు తన కలానికి ఓ పేరు ఉండాలి కదా అని.. కలానికి పెన్సిల్ అని పేరు పెట్టుకున్నారు. అయితే పెన్సిల్, ప్రియ ఇప్పుడు షూటింగ్‌కు గుడ్‌బై చెప్పారట.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ టీజర్ రీసెంట్‌గా విడుదలైంది. ఈ టీజర్‌లో నానితో పాటు ఐదు పాత్రలు చేసిన అల్లరిని చూశాం. నాని, ప్రియాంక అరుల్ మోహన్‌లు షూటింగ్‌కు వీడ్కోలు చెప్పినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు హీరోయిన్ ప్రియా ట్వీట్ చేశారు. ఇక ఈ మూవీలో ఆ ఐదుగురి పాత్రలతో మన రైటర్ ఎలా నెగ్గుకొచ్చాడు? దీంట్లో ప్రియ పాత్ర ఏంటో చూడాలంటే ఆగస్టు 30 వరకు ఆగాల్సిందే.
Pencil and Priya signing off from the sets of Gang Leader & we're on our way to meet you at the nearest theatre, soon.@NameisNani 😋#Gangleader #pencil#priya pic.twitter.com/NEgokZPXzY
— Priyanka Mohan (@priyankaamohan) July 29, 2019


