హిందీలో ‘అలా మొదలైంది’ | Nandini Reddy Debuting In Bollywood With Ala Modalaindi | Sakshi
Sakshi News home page

హిందీలో ‘అలా మొదలైంది’

Apr 14 2014 11:24 PM | Updated on Apr 3 2019 6:23 PM

హిందీలో ‘అలా మొదలైంది’ - Sakshi

హిందీలో ‘అలా మొదలైంది’

చిన్న సినిమాగా రూపొంది, 2011లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘అలా మొదలైంది’. హీరోహీరోయిన్లు నాని, నిత్యామీనన్‌లకే కాక చాలామందికి

 చిన్న సినిమాగా రూపొంది, 2011లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘అలా మొదలైంది’. హీరోహీరోయిన్లు నాని, నిత్యామీనన్‌లకే కాక చాలామందికి జీవితాన్నిచ్చిన సినిమా అది. ఇప్పుడు ‘అలా మొదలైంది’ టాపిక్ దేనికంటే... త్వరలో ఈ కథ బాలీవుడ్ తెరపై మెరవనుంది. తెలుగులో ఈ సినిమా నిర్మించిన కె.ఎల్. దామోదరప్రసాదే హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారాయన. ‘అలా మొదలైంది’తో దర్శకురాలిగా పరిచయమైన నందినీరెడ్డి... ఈ బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రెండు నెలల తర్వాత ఈ చిత్రం సెట్స్‌కి వెళుతుందని సమాచారం. బాలీవుడ్‌కి చెందిన ఓ యువ కథానాయకుడు ఇందులో నటించనున్నారట.
 

Advertisement
 
Advertisement
Advertisement