కలియుగ కర్ణుడు | Nandamuri Balakrishna to be seen as 'Karna'! | Sakshi
Sakshi News home page

కలియుగ కర్ణుడు

Oct 10 2017 1:17 AM | Updated on Aug 29 2018 1:59 PM

Nandamuri Balakrishna to be seen as 'Karna'! - Sakshi

భారతంలో కర్ణుడి గురించి మనకు తెలుసు. ఇచ్చిన మాట మీద నిలబడ్డ మహానుభావుడు. మరి, ఈ కలియుగ కర్ణుడు ఏం చేశాడు? ఎవరికి ఏం చేస్తానని మాటిచ్చాడు? ఇచ్చిన మాటకు కట్టుబడి ఏమేం చేయాల్సి వచ్చింది? అనేది ప్రేక్షకులకు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు!! నందమూరి బాలకృష్ణ హీరోగా కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న సినిమాకు ‘కర్ణ’ టైటిల్‌ని ఖరారు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నెల 5 నుంచి క్లైమాక్స్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 16 వరకు హైదరాబాద్‌ షెడ్యూల్‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్లు నయనతార, నటాషా దోషి, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement