నానా ప్లేస్‌లో రానా

Nana Patekar gets replaced by Rana Daggubati Housefull 4 - Sakshi

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో మీటూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణల కారణంగా కొంత మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు తమకు తాముగా ప్రాజెక్ట్స్‌నుంచి తప్పుకుంటుండగా.. మరికొందరిని యూనిట్ సభ్యులే తొలగిస్తున్నారు. ముఖ్యంగా హౌస్‌ఫుల్‌ 4 సినిమా మీద ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నానా పటేకర్‌, దర్శకుడు సాజిద్‌ఖాన్‌లను ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పించటంతో కొత్తవారిని వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్‌. ఇప్పటికే దర్శకుడిగా ఫర్హాద్‌ సంజినీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నానా పటేకర్‌ స్థానంలో సౌత్ స్టార్‌ రానా దగ్గుబాటి నటించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top