ఆ హీరోయిన్‌ను విడుదల చేయండి | nampally court orders to release heroin | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్‌ను విడుదల చేయండి

Oct 30 2014 2:54 AM | Updated on Oct 19 2018 7:52 PM

వ్యభిచారం కేసులో అరెస్టయి, ప్రజ్వల రెస్క్యూ హోమ్‌లో ఉంటున్న సినీ నటిని విడుదల చేయాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు బుధవారం ఆదేశించింది.

ప్రజ్వల హోమ్‌కు నాంపల్లి కోర్టు ఆదేశం

 సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం కేసులో అరెస్టయి, ప్రజ్వల రెస్క్యూ హోమ్‌లో ఉంటున్న సినీ నటిని విడుదల చేయాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు బుధవారం ఆదేశించింది. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన నటి ఎర్రమంజిల్ కోర్టు ఆదేశంతో రెస్క్యూ హోమ్‌లో ఉంటున్న విష యం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ ఆమె తల్లి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా బుధవారం న్యాయమూర్తి టి.రజని విచారించారు. సదరు నటి మేజర్ అని రెస్క్యూ హోమ్‌లో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరఫు  న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. పోలీసులు చెబుతున్నదానిలో వాస్తవం లేదని.. ఆమెను విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. సదరు నటిని హోం నుంచి విడుదల చేయాలని ఆదేశించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement