నమిత పెళ్లి సందడి మొదలైంది! | Sakshi
Sakshi News home page

నమిత పెళ్లి సందడి మొదలైంది!

Published Wed, Nov 22 2017 10:31 PM

Namitha mehendi ceremony pics viral on social media - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, సినిమా: దక్షిణాది నటి నమిత ఇంట్లో పెళ్లి వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. ఈ నెల 24న నమిత, వీరేంద్ర చౌదరీల వివాహం తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల ముందు నమితకు మెహందీ ఫంక్షన్ ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నమిత చేతులకు మెహందీ పెట్టించుకుంటూ దిగిన ఫొటోలకు భారీగా లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. మెహందీ ఏర్పాట్లకు ముందు కుటుంబసభ్యులతో కలిసి నమిత డ్యాన్స్ చేసిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. చేతులకు మెహందీ పూర్తయిన తర్వాత నమిత ఆ ఫొటోలను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.

'ఇటీవల నాకోసం ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ లో వీర్ నాకు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో నేను ఎటూ తేల్చుకోలేకపోయా..! కానీ మా ఇద్దరి లక్ష్యాలు ఒకటే కావటం, ఇద్దరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉండటం మమ్మల్ని దగ్గర చేసింది. అంతేకాదు ఇద్దరికి ప్రయాణాలు చేయటం ఇష్టం, ముఖ్యంగా ట్రెక్కింగ్ అంటే ఇష్టం. ఇద్దరం జంతువులను ప్రేమిస్తాం. ఇలా చాలా విషయాల్లో ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే కావటంతో నేను నో చెప్పలేకపోయానంటూ' నటుడు, నిర్మాత వీరేంద్రతో తన ప్రేమకథను నటి నమిత అందరికీ వివరించారు.

Advertisement
Advertisement