బాలయ్య నోరు అదుపులో పెట్టుకో: నాగబాబు | Nagababu Fires On Nandamuri Balakrishna | Sakshi
Sakshi News home page

బాలయ్యకు నాగబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

May 28 2020 6:59 PM | Updated on Jul 28 2022 7:24 PM

Nagababu Fires On Nandamuri Balakrishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వివాదాదస్పద ట్వీట్లతో ఇటీవల తరచుగా విమర్శలను ఎదుర్కొంటున్న సినీనటుడు, జనసేన నేత నాగబాబు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎవరూ ఊహించని విధంగా ఈసారి నందమూరి బాలకృష్ణపై విరుచుకుపడ్డారు. బాలయ్య నోటిని అదుపులో పెట్టుకోవాలి అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు‌. టాలీవుడ్‌ ప్రముఖుల వరుస భేటీలపై తనకు సమాచారం లేదంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు. ‘భూములు పంచుకుంటున్నారంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఇండస్ట్రీ బాగు కోసమే మంత్రితో సమావేశం అయ్యారు. భూములు పంచుకోవడానికి కాదు. సీనియర్‌ నటుడైన బాలకృష్ణ ఇలా అర్థంలేని విధంగా మాట్లాడం సరికాదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయనేది ఏపీకి వెళ్తే తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీనే కాదు.. తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా బాలయ్య అవమానించారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి ’అని ఘాటు వ్యాఖ్యలతో విరుకుపడ్డారు. (బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు)

ఇక విషయానికొస్తే తెలంగాణలో సినిమా షూటింగ్స్‌కు అనుమతులు కల్పించాలంటూ టాలీవుడ్‌ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ ‌యాదవ్‌తోనూ మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే గురువారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్‌ ఘాట్‌కు బాలకృష్ణ వచ్చారు. ఈ సందర్భగా సినిమా షూటింగ్స్‌పై విలేఖరులు ప్రశ్నించగా.. సినీ పెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదన్నారు. చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశానికి తనను ఎవరూ పిలవలేదని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో అంతా కూర్చుని భూములు కానీ పంచుకుంటున్నారా?.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఇదివరకే నిర్మాత సి. కళ్యాణ్‌‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. తాజాగా నాగబాబు సైతం బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. నాగబాబు వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇది ఎంత దూరం వెళ్తుందనేది వేచి చూడాలి. (బాలయ్య వ్యాఖ్యలపై సి. కళ్యాణ్‌ వివరణ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement