బాలయ్య వ్యాఖ్యలపై సి. కళ్యాణ్‌ వివరణ

C Kalyan Gives Clarity On Balakrishna Comments In Film Industry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన  విషయం తనకు తెలియదని హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటు టాలీవుడ్‌లోనూ ఈ విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో సినీ పెద్దలు బాలయ్యను పట్టించుకోవడం లేదని, సినీ ఇండస్ట్రీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ తాజాగా‌ స్పందించారు. (బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..)

‘ప్రస్తుతం నిర్మాతలుగా మేము చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాము. బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతగా ఏ సినిమా చేయడం లేదు. అవసరమైనప్పుడు బాలయ్య మాతో చర్చల్లో పాల్గొంటారు. ఇప్పటివరకు జరిగిన ప్రతీ విషయాన్ని బాలయ్యకు నేనే స్వయంగా చెప్పాను. ఇండస్ట్రీ అంతా ఒక్కటే, ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు. ఇండస్ట్రీలో ఎవరికి ఉండే గౌరవం వారికి ఉంది’ అంటూ సి. కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.  ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని టాలీవుడ్‌ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సినీ పెద్దలు సమావేశమైన విషయం తెలిసిందే. (సినిమా పరిశ్రమ బతకాలి: కేసీఆర్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top