C.kalyan
-
‘ఇంట్లో పెళ్లి కాదు.. బొట్టు పెట్టి పిలవడానికి’
సాక్షి, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నివాసంలో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) సభ్యుల రివ్యూ సమావేశం ముగిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులు, పేద సినీ కార్మికులకు అందిన సాయం, లోట్లుపాట్లపై సీసీసీ సభ్యుల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడారు. ఇటీవల సినీ పెద్దలు ప్రభుత్వంతో జరిపిన చర్చలపై నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. (భూములు పంచుకుంటున్నారా?) ‘ఎవరి ఇంట్లో పెళ్లి కాదు, బొట్టు పెట్టి పిలవడానికి. పలానా వాళ్లని పిలవాలి అనేది లేదు నన్ను కూడా పిలవలేదు. ఈ విషయాన్ని ఇంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు. మహేశ్, వెంకటేశ్, ఇలా చాలా మందిని పిలువలేదు. మమ్మల్ని పిలవలేదు అంటే అర్థం లేదు. బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం. ఆ వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమకు సంబంధంలేదు. ఇప్పటివరకు నిర్మాతలుగా మేము చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాము. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బాలయ్య లేకుండా సినీ ఇండస్ట్రీ ఉందనుకోవడం లేదు. ఆయన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తాం’ అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. (బాలకృష్ణకు ఇక్బాల్ గట్టి కౌంటర్!) బాలయ్య అలా అనాల్సిందికాదు: సి.కళ్యాణ్ ‘ఈ రోజు చిరంజీవి ఇంట్లో సీసీసీ రివ్యూ మీటింగ్ సజావుగా జరిగింది. పలు విషయాలపై చర్చించాము. ఇక ప్రభుత్వంతో సినీ పెద్దలు జరిపిన సమావేశం రియల్ఎస్టేట్ సమావేశం అని ఎందుకు అన్నారో తెలియదు. అయితే బాలయ్య ఆలా అన్సాలింది కాదు. సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆందుకే వాళ్లు సమావేశానికి వచ్చారు. ఇప్పటివరకు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుకునే సమావేశాలే జరిగాయి’ అని నిర్మాత సి. కళ్యాణ్ వివరించారు. -
బాలయ్య వ్యాఖ్యల దుమారం.. కళ్యాణ్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: సినీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదని హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటు టాలీవుడ్‌లోనూ ఈ విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో సినీ పెద్దలు బాలయ్యను పట్టించుకోవడం లేదని, సినీ ఇండస్ట్రీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ తాజాగా స్పందించారు. (బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..) ‘ప్రస్తుతం నిర్మాతలుగా మేము చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాము. బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతగా ఏ సినిమా చేయడం లేదు. అవసరమైనప్పుడు బాలయ్య మాతో చర్చల్లో పాల్గొంటారు. ఇప్పటివరకు జరిగిన ప్రతీ విషయాన్ని బాలయ్యకు నేనే స్వయంగా చెప్పాను. ఇండస్ట్రీ అంతా ఒక్కటే, ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు. ఇండస్ట్రీలో ఎవరికి ఉండే గౌరవం వారికి ఉంది’ అంటూ సి. కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సినీ పెద్దలు సమావేశమైన విషయం తెలిసిందే. (సినిమా పరిశ్రమ బతకాలి: కేసీఆర్) -
రివ్యూ: ‘రూలర్’ చిత్రం ఎట్లుందంటే?
మూవీ: రూలర్ జానర్: యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు: బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, భూమిక, జయసుధ, షియాజీ షిండే, ప్రకాష్‌రాజ్, పరాగ్ త్యాగి, నాగినీడు, ఝాన్సీ సంగీతం: చిరంతన్ భట్ దర్శకత్వం: కె.ఎస్ రవికుమార్ నిర్మాత: సి. కల్యాణ్ నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఈ హీరో సినిమా వస్తే ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కు డబుల్ ధమాకానే. వారికి కావాల్సిన ఫుల్ మాస్ ఎలిమెంట్స్ బాలయ్య సినిమాలో చూడొచ్చనే ఎగ్జైట్మెంట్తో ఉంటారు. ఇక తమిళనాట స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన కెఎస్ రవికుమార్ బాలయ్య బాబుతో రెండో సారి జత కట్టి ‘రూలర్’ ను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, ట్రైలర్లతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో భారీ అంచనాల నడుమ శుక్రవారం ‘రూలర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? నయా లుక్స్‌లో బాలయ్య ఏ మేరకు ఆకట్టుకున్నారు? ‘రూలర్’తో బాలకృష్ణ ఈ ఏడాదిని ఘనంగా ముగించారా? అనేది రివ్యూలో చూద్దాం. కథ: ఈ సినిమా కథ ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ప్రారంభమై వయా రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. సరోజిని నాయుడు(జయసుధ)కు చెందిన పలు కంపెనీల బాధ్యతలను రెండేళ్లు విదేశాల్లో ఐటీ రంగంపై ప్రత్యేక శిక్షణ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తన వారసుడు అర్జున్ ప్రసాద్(బాలకృష్ణ)కు అప్పగిస్తారు. అయితే పోటీ ప్రపంచంలో భాగంగా తన ప్రత్యర్థి కంపెనీకి చెందిన హారిక(సోనాల్) అర్జున్‌కు తారసపడుతుంది. ఈ క్రమంలోనే అర్జున్‌తో హారిక ప్రేమలో పడుతుంది. అయితే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉత్తరప్రదేశ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అర్జున్ ప్రసాద్ భావిస్తాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సరోజిని నాయుడు అడ్డుపడతారు. ఈ ప్రాజెక్ట్‌కు తన తల్లి ఎందుకు అడ్డుపడుతుందో తెలుసుకొని ఉత్తర ప్రదేశ్ బయల్దేరుతాడు అర్జున్. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. యూపీలో అర్జున్ను అందరూ పోలీస్ అఫీసర్ ధర్మ అని పిలుస్తారు. ఇదే క్రమంలో లోకల్ మినిస్టర్ భవానీనాథ్ ఠాగూర్(పరాగ్ త్యాగీ) అర్జున్‌పై దాడి చేయిస్తాడు. దీనికి గల కారణాలు ఏంటి? అసలు ధర్మ, అర్జున్ ఒక్కరేనా? లేక వేరువేరా?. అసలు ఈ కథలోకి సంధ్య(వేదిక), సీతారామయ్య(నాగినీడు), నిరంజనా ప్రసాద్(భూమిక)లు ఎందుకు ఎంటర్ అవుతారు? వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: ఈ సినిమాలో రెండు ఢిపరెంట్ షేడ్స్‌లో కనిపించిన బాలయ్య తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రేమనని.. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోనని ఈ సినిమాతో నిరూపించారు. ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ఇరగదీశాడు. సినిమా మొత్తం ఒంటి చేత్తో నడిపించాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చిత్రంలో బాలయ్య వేసిన స్టెప్పులకు థియేటర్లో ఒకటే ఈలలు గోలలు. ఇక నటనకు పెద్ద స్కోప్ లేకపోయినప్పటికీ గ్లామరస్ పాత్రల్లో హీరోయిన్లు సోనాల్, వేదికలు ఆకట్టుకున్నారు. వారి అందచందాలతో కుర్రకారును కట్టిపడేశారు. మరోవైపు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భూమికకు ఈ చిత్రంలో ఎలాంటి డైలాగ్‌లు లేవు. కానీ స్టోరీ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. మిగతా పాత్రల్లో నాగినీడు, ప్రకాష్‌రాజ్, పరాగ్ త్యాగి, ఝాన్సీ, తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: ‘నలభైకి పైగా అంతస్థుల గల మేడ నుంచి పడిపోతున్న ఓ యువతిని హెలికాప్టర్లో వచ్చి బాలయ్య కాపాడతాడు’. ఈ ఒక్క సీన్‌తో అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుందో. బాలకృష్ణ సినిమా అంటే ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో నందమూరి ఫ్యాన్స్ ఊహించని సీన్లు, హీరో ఎలివేషన్ షాట్స్, ఫైట్లు హై రేంజ్లో ఉన్నాయి. ‘ఎన్టీఆర్’ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత వచ్చే చిత్రం అన్ని హంగులతో ఉండాలని భావించిన బాలకృష్ణ.. తన తదుపరి చిత్రం కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన కెఎస్ రవికుమార్‌కు అప్పగించాడు. అయితే బాలయ్య బాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుబు నూటికినూరు శాతం నిలబెట్టుకోలేకపోయాడు. కేవలం బాలకృష్ణ ఇమేజ్ను మాత్రమే పరిగణలోకి తీసుకుని డైరెక్టర్ కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథలో ఏదో మూలన కాస్త కొత్త దనం కనిపించినప్పటికీ.. దానిని అటుతిప్పి ఇటుతిప్పి రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మలిచాడు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్, ఫైట్స్, కమర్షియల్ హంగుల మీద దృష్టిపెట్టినంత శ్రద్ద కథ, కథనంపై పెడితే ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక రెండో అర్థబాగంలో పోలీస్ ఆఫీసర్‌గా వచ్చే బాలయ్య లుక్ సగటు ప్రేక్షకుడికి రుచించలేదు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్లు, ఇంగ్లీష్ డైలాగ్ సోనాల్ అందచందాలు, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్, శ్రీనివాస్ రెడ్డి బృందం కామెడీతో ఫస్టాఫ్ సక్సెస్ ఫుల్‌గా ముగుస్తుంది. తొలి అర్థభాగం ముగిసే సరికి సినిమా అసలు కథలోకి ఎంటర్ కాదు. అయితే సెకండాఫ్‌లో అసలు స్టోరీలోకి ఎంటర్ అయ్యాక సినిమా ఎటో వెళ్లిపోతుంది. దీనిపై దర్శకుడు తన సీనియార్టీని ఉపయోగించి అభిమానులను కాస్త మెస్మరైజ్ చేయాల్సింది. కానీ దర్శకుడు ఏమాత్రం తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించలేదని ఈ సినిమాతో అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే సినిమాకు చాల ప్లస్‌గా నిలిచింది డ్యాన్స్. బాలయ్య ఇమేజ్ను పరిగణలోకి తీసుకుని డ్యాన్స్‌లను ఎక్సలెంట్‌గా కంపోజ్ చేశారు మూవీ కొరియోగ్రాఫర్స్. ఫార్మేషన్స్, బాలయ్యకు ఆప్ట్ అయ్యే స్లైలీష్ స్టెప్పులను కంపోజ్ చేశారు. సినిమాకు మరోప్లస్ పాయింట్స్ ఫైట్స్. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించిన ఫైట్లు వారిని మైమరిపిస్తాయి. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సాంగ్స్, హీరోయిన్ ఎంట్రీ సీన్లలో కెమెరా పనితనం కనిపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాకు తగ్గట్టు పాటలను కంపోజ్ చేశాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో రఫ్పాడించాడు. అయితే ఎడిటింగ్, స్క్రీన్ ప్లేపై కాస్త దృష్టి పెట్టాల్సి ఉండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఓవరాల్‌గా సినిమా గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షోతో సినిమాను బాలయ్య నెట్టుకొచ్చాడు. బాలకృష్ట కష్టానికి తగ్గట్టు దర్శకుడు తన ప్రతిభను ప్రదర్శిస్తే సినిమా వేరే రేంజ్లో ఉండేది. ప్లస్ పాయింట్స్ బాలకృష్ణ ఎనర్జీ డ్యాన్స్ ఫార్మేషన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ దర్శకత్వ విలువలు ఎడిటింగ్ సాగదీత సీన్లు సినిమా నిడివి కథనంలో కొత్తదనం లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
ఘనంగా సి. కల్యాణ్ కుమారుని వివాహ వేడుక
-
టాలీవుడ్‌ను ఆడిపోసుకుంటున్నారు: జీవిత
హైదరాబాద్ : టాలీవుడ్లో డ్రగ్స్ కలకలంపై నటి జీవిత సీరియస్‌గా స్పందించారు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమను ఆడిపోసుకుంటున్నారని, మిగిలినవారిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. సినీ పరిశ్రమలో ఏదైన సంఘటన జరిగితే దాన్ని అందరికి ఆపాదించి చులకన చేయడం సరికాదన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ రంగం అని, నటీనటులను ...అభిమానులు అనుకరించే అవకాశం ఉన్నందున ...అందరూ కేర్‌ఫుల్‌గా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్నవారు అంతా తప్పు చేశారనుకుంటే పొరపాటే అన్నారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే భవిష్యత్‌లో మళ్లీ జరగకుండా దాన్ని సరిదిద్దుకోవాలని జీవిత సూచించారు. విపత్తులు, ఎలాంటి ఆపదలు ఎదురైనా తెలుగు చిత్ర పరిశ్రమ బాధ్యతాయుతంగా తమవంతు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఒక్క టాలీవుడ్‌నే బాధ్యులుగా పేర్కొనడం సరైంది కాదని జీవిత అభిప్రాయపడ్డారు. ‘సినిమావాళ్ల గురించి ఎవరిమీదైనా, ఏదైనా రాయవచ్చనే ధోరణి ఉంది. యూట్యూబ్‌లో చేస్తే తెలుస్తుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. స్కూల్ పిల్లల వరకూ డ్రగ్స్ పాకాయి. అలాగే ఎప్పటి నుంచో పబ్‌లు, క్లబ్‌ల కల్చర్ ఉంది. ఇన్నాళ్లు ఏం చేశారు. ఎంత విచ్చలవిడిగా వదిలేశారు. ఎంతోమంది సొసైటీలో డ్రగ్స్ తీసుకుంటున్నారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ కేవలం సినిమావాళ్లను ముందుకు తీసుకురావడం సరికాదు. డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే అధికారుల లోపం కూడా ఉంది. సినిమా వాళ్లు డ్రగ్స్ తీసుకోవడం లేదని నేను అనడం లేదన్నారు. సినిమా ఇండస్ట్రీ దానికేమీ అతీతం కాదన్నారు. ప్రతి విషయానికి చిత్ర పరిశ్రమను టార్గెట్ చేయడం సరికాదు. పిల్లలను కూడా బలి తీసుకుంటున్న డ్రగ్స్‌పై సమాజం కూడా పోరాటం చేయాలి’ అని జీవిత పిలుపునిచ్చారు. -
‘తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించాల్సిందే’
హైదరాబాద్ : తప్పు చేసినవారు శిక్ష అనుభవించాల్సిందేనని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరోతో పాటు దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. ఈ వ్యవహారంపై సి. కల్యాణ్ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ సిట్ విచారణకు తాము సహకరిస్తామన్నారు. ఇండస్ట్రీలో కొందరికి నోటీసులు మాత్రమే వచ్చాయన్నారు. అయితే నోటీసులు అందుకున్నంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా డ్రగ్స్ వ్యవహారంలో తమకు నోటీసులు అందిన మాట వాస్తవమేనని పలువురు అంగీకరించారు. విచారణకు హాజరై తమకు తెలిసిన విషయాలు చెబుతామన్నారు. కాగా డ్రగ్స్‌కేసులో ఇవాళ మరికొందరి పేర్లు వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. drugs racket, tollywood, C.kalyan,enforcement, cine celebrities, డ్రగ్స్ కేసు, ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు, సినిమా ప్రముఖులు, టాలీవుడ్, సి.కల్యాణ్ -
బోగస్ సంస్థలతో మోసపోవద్దు
‘‘తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందాయి. కొందరు వీటి అనుబంధ పేర్లతో బోగస్ సంస్థలు ఏర్పాటు చేసి కొత్త నిర్మాతలను మోసగిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్ సంస్థల వలలో పడి మోసపోవద్దు’’ అని తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు సి.కల్యాణ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు రామ్మోహన్ రావు అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – ‘‘బోగస్ సంస్థలపై నిఘా ఉంచేందుకు ‘అడ్‌హక్’ కమిటీ ఏర్పాటు చేశాం. కొత్త నిర్మాతలు ఎవరైనా తెలుగు ఫిలిం ఛాంబర్ లేదా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మాత్రమే సభ్యత్వం తీసుకోవాలి. ఎలాంటి గుర్తింపు లేని బోగస్ సంస్థల్లో సభ్యత్వం తీసుకుని, మోసపోతే న్యాయం చేయలేం. సినిమా అవార్డులన్నవి ప్రభుత్వాలు ఇస్తేనే బాగుంటుంది కానీ, సంస్థలు కాదు. ఇల్లీగల్ వ్యవహారాల్లో కౌన్సిల్ జోక్యం చేసుకోదు’’ అన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యదర్శి మురళీమోహన్, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
'నాన్న అనారోగ్యానికి కారణం కల్యాణే'
హైదరాబాద్: 'మా నాన్న ఎనాడూ ఎవ్వరినీ మోసం చేయలేదు. బాధితులంటూ ఎవరూ లేరు. ఒకవేళ అలాంటివేమైనా ఉంటే వారికి చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నిర్మాత సి. కల్యాణ్ అనుచిత వ్యాఖ్యల వల్లే మా నాన్న కలత చెందారు. ఆయన అనారోగ్యానికి కారణం కల్యాణే' అని నిర్మాత నట్టికుమార్ కూతురు కరుణ, కొడుకు క్రాంతిలు ఆరోపించారు. గ్యాంగ్ స్టర్ నయీంతో నిర్మాత సి. కల్యాణ్ కు సంబంధాలున్నాయని కొద్ది రోజుల కిందట తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన నట్టికుమార్ ప్రస్తుతం అనారోగ్యానిగురై హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నట్టికుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతోన్న ఆయన పిల్లలు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. (అతడి జీవితమే బ్లాక్మెయిల్, నీలిచిత్రాలు) 'మా నాన్న చేసిన ఆరోపణలు నిజమో కాదో తేల్చకుండా సి. కల్యాణ్ మా ఫ్యామిలీపై నోరు పారేసుకున్నారు. ఆసుపత్రి నుంచి బయటికి రాగానే ఆధారాలతో సహా అన్నీ నిరూపిస్తారు' అని కరుణ, క్రాంతిలు చెప్పారు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం సినీ పరిశ్రమలోని కొందరు నిర్మాతలతో అతనికి సంబంధాలున్నాయన్న నట్టికుమార్ వ్యాఖ్యలను నిర్మాతల మండలి తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సి. కల్యాణ్.. నట్టికుమార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
'ఆనం వివేకా పిచ్చి చేష్టలపై సినిమా తీస్తా'
నెల్లూరు : మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పిచ్చి చేష్టలపై త్వరలో సినిమా తీయనున్నట్టు సినీ నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల్లూరులోని రామ్‌నగర్‌లో ఉన్న స్థలంపై కమీషన్ కోసం వివేకా కావాలనే వివాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 2008లోనే మక్సూద్ అలీ వద్ద స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్లు కళ్యాణ్ చెప్పారు. అప్పట్లో ఆ స్థలం మైనార్టీల శ్మశానం అంటూ కొందరు కోర్టుకు వెళ్లగా.. అది తప్పని, ఆ స్థలం ప్రైవేటుదేనని కోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. రామ్‌నగర్‌కు కార్పొరేటర్‌గా, అప్పటి మేయర్‌గా కొనసాగిన భానుశ్రీకి తాను అక్కడ 100 అంకణాల స్థలం ఇచ్చినట్లు అప్పట్లో పత్రికల్లో కథనాలు వచ్చాయని, వాటిని వివేకా చూసి ఖండించాల్సిందిగా తనను ఆ రోజు కోరారన్నారు. ఆ రోజు 100 అంకణాల స్థలం ఇవ్వలేదని ఈ రోజు రాజకీయం చేస్తావా? అంటూ వివేకానుద్దేశించి కళ్యాణ్ ప్రశ్నించారు. వివేకాకు అధికారం పోయిన తర్వాత పిచ్చి పట్టిందని, అందువల్లే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు. -
'ఆయన అక్రమాలపై సినిమా తీస్తాను'
-
పంజాగుట్ట పీఎస్ లో లొంగిపోయిన సి.కల్యాణ్
-
పంజాగుట్ట పీఎస్‌లో లొంగిపోయిన సి.కల్యాణ్
హైదరాబాద్ : టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ బుధవారం హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మహిళపై దాడి చేసిన కేసులో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనపై చేయి చేసుకున్నారంటూ సి.కల్యాణ్ పై ఏప్రిల్ 28న డాక్టర్ కవిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ ఫ్లాట్ విషయంలో తనను సి.కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా మెట్రో రైలు నష్టపరిహారం నిమిత్తం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లో 11 ఫ్లాట్స్‌కు రూ.1.4 కోట్లు ఆమె చెల్లించింది. సి. కల్యాణ్ కూడా అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి సి.కల్యాణ్ ప్రత్యేక ఖాతా తెరవటంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు సంబంధించి తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని డాక్టర్ కవిత అర్థరాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సి. కల్యాణ్‌పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
మహిళా డాక్టర్‌పై చేయి చేసుకున్న నిర్మాత
-
మహిళా డాక్టర్‌పై చేయి చేసుకున్న నిర్మాత సి.కల్యాణ్
హైదరాబాద్ : టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనపై చేయి చేసుకున్నారంటూ ఆయనపై ఓ మహిళా డాక్టర్ ...జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓ ఫ్లాట్ విషయంలో తనను సి.కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ డాక్టర్ కవిత తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా మెట్రో రైలు నష్టపరిహారం నిమిత్తం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లో 11 ఫ్లాట్స్‌కు రూ.1.4 కోట్లు ఆమె చెల్లించింది. సి. కల్యాణ్ కూడా అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి సి.కల్యాణ్ ప్రత్యేక ఖాతా తెరవటంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు సంబంధించి తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని డాక్టర్ కవిత అర్థరాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సి. కల్యాణ్‌పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. -
అన్నీ మంచి శకునములే!
‘‘శ్రీ శుభ శ్వేత ఫిలిమ్స్ సంస్థ మొదలుపెట్టాక మేం తొలుత విడుదల చేస్తున్న సినిమా ఇదే. ఏ ముహూర్తాన ఈ కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేశామో కానీ... అన్నీ మంచి శకునములే’’ అని సి.కల్యాణ్ అన్నారు. హన్సిక, లక్ష్మీరాయ్, ఆండ్రియా, సుందర్.సి ముఖ్య తారలుగా తమిళంలో రూపొందిన చిత్రం ‘అరణ్మణై’. ఈ చిత్రం ‘చంద్రకళ’గా తెలుగులో విడుదల కానుంది. శ్వేతలాన, వరుణ, తేజ, సి.వి.రావు నిర్మాతలు. సి.కల్యాణ్ ఈ చిత్రానికి సమర్పకుడు. నేడు సి.కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ నెల 19న సినిమాను విడుదల చేయనున్నట్లు సి.కల్యాణ్ తెలిపారు. చెన్నయ్‌లో ‘అరణ్మణై’ సినిమా పోస్టర్ చూడగానే తనకు ‘అరుంధతి’ సినిమా గుర్తొచ్చిందనీ, ఈ సినిమాను తెలుగులో తానే అనువదించాలనుకున్నానని నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి చెప్పారు. దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాతలు కొడాలి వెంకటేశ్వరరావు, వజ్జా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. -
చిన్న సినిమాల కోసం థియేటర్లు నిర్మించాలనుకుంటున్నాం...
‘‘దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలికి సంబంధించి చెన్నయ్‌లో ఓ ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలనేది ముప్పై ఏళ్ల నాటి కల. మొత్తానికి ఆ కల నెరవేరింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కృతజ్ఞతలు’’ అని దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు సి.కల్యాణ్ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో పత్రికలవారితో సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘2010లో దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలికి అధ్యక్షుణ్ని అయ్యాను. నిజానికి ఆ పదవీకాలం ఏడాది మాత్రమే. కానీ అయిదేళ్లుగా ఆ పదవిలోనే కొనసాగుతున్నా. నాలుగు సినీ పరిశ్రమలకు సంబంధించి త్వరలో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయనున్నాం. సభ్యుల కుటుంబాల సంక్షేమంతో పాటు, పిల్లల చదువుకూ అవకాశాలు కల్పిస్తాం. చిన్న సినిమాలు కూడా శాటిలైట్‌కి వెళ్లే విధంగా చర్యలు చేపడతాం. అయిదు రాష్ట్రాలకు సంబంధించిన సెకండ్ గ్రేడ్ పట్టణాల్లో 300 సీటింగ్‌తో థియేటర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కేవలం చిన్న సినిమాల కోసమే ఈ థియేటర్లు’’ అని చెప్పారు. వృద్ధాశ్రమం ఏర్పాటుకు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు తెలిపారు.