'నాన్న అనారోగ్యానికి కారణం కల్యాణే' | cine producer natti kumar children speaks over his father health | Sakshi
Sakshi News home page

'నాన్న అనారోగ్యానికి కారణం కల్యాణే'

Aug 28 2016 5:49 PM | Updated on Sep 4 2017 11:19 AM

'నాన్న అనారోగ్యానికి కారణం కల్యాణే'

'నాన్న అనారోగ్యానికి కారణం కల్యాణే'

కల్యాణ్ అనుచిత వ్యాఖ్యల వల్లే మా నాన్న కలత చెందారు. ఆయన అనారోగ్యానికి కారణం కల్యాణే

హైదరాబాద్: 'మా నాన్న ఎనాడూ ఎవ్వరినీ మోసం చేయలేదు. బాధితులంటూ ఎవరూ లేరు. ఒకవేళ అలాంటివేమైనా ఉంటే వారికి చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నిర్మాత సి. కల్యాణ్ అనుచిత వ్యాఖ్యల వల్లే మా నాన్న కలత చెందారు. ఆయన అనారోగ్యానికి కారణం కల్యాణే' అని నిర్మాత నట్టికుమార్ కూతురు కరుణ, కొడుకు క్రాంతిలు ఆరోపించారు.

గ్యాంగ్ స్టర్ నయీంతో నిర్మాత సి. కల్యాణ్ కు సంబంధాలున్నాయని కొద్ది రోజుల కిందట తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన నట్టికుమార్ ప్రస్తుతం అనారోగ్యానిగురై హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నట్టికుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతోన్న ఆయన పిల్లలు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. (అతడి జీవితమే బ్లాక్‌మెయిల్, నీలిచిత్రాలు)

'మా నాన్న చేసిన ఆరోపణలు నిజమో కాదో తేల్చకుండా సి. కల్యాణ్ మా ఫ్యామిలీపై నోరు పారేసుకున్నారు.  ఆసుపత్రి నుంచి బయటికి రాగానే ఆధారాలతో సహా అన్నీ నిరూపిస్తారు' అని కరుణ, క్రాంతిలు చెప్పారు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం సినీ పరిశ్రమలోని కొందరు నిర్మాతలతో అతనికి సంబంధాలున్నాయన్న నట్టికుమార్ వ్యాఖ్యలను నిర్మాతల మండలి తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సి. కల్యాణ్.. నట్టికుమార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement