మహిళా డాక్టర్పై చేయి చేసుకున్న నిర్మాత సి.కల్యాణ్ | complaint filed against producer C.Kalyan | Sakshi
Sakshi News home page

మహిళా డాక్టర్పై చేయి చేసుకున్న నిర్మాత సి.కల్యాణ్

Apr 28 2015 8:54 AM | Updated on Sep 3 2017 1:02 AM

మహిళా డాక్టర్పై చేయి చేసుకున్న నిర్మాత సి.కల్యాణ్

మహిళా డాక్టర్పై చేయి చేసుకున్న నిర్మాత సి.కల్యాణ్

టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనపై చేయి చేసుకున్నారంటూ ఆయనపై ఓ మహిళా డాక్టర్

హైదరాబాద్ : టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనపై చేయి చేసుకున్నారంటూ ఆయనపై ఓ మహిళా డాక్టర్ ...జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓ ఫ్లాట్ విషయంలో తనను సి.కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ డాక్టర్ కవిత తన ఫిర్యాదులో పేర్కొంది.

కాగా మెట్రో రైలు నష్టపరిహారం నిమిత్తం  జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లో 11 ఫ్లాట్స్కు రూ.1.4 కోట్లు ఆమె చెల్లించింది. సి. కల్యాణ్ కూడా అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి సి.కల్యాణ్ ప్రత్యేక ఖాతా తెరవటంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు సంబంధించి తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని డాక్టర్ కవిత అర్థరాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సి. కల్యాణ్పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement