'ఆనం వివేకా పిచ్చి చేష్టలపై సినిమా తీస్తా' | Tollywood Producer C kalyan fires on Ex MLA Anam Vivekananda reddy | Sakshi
Sakshi News home page

'ఆనం వివేకా పిచ్చి చేష్టలపై సినిమా తీస్తా'

May 29 2015 8:15 PM | Updated on Aug 28 2018 4:30 PM

'ఆనం వివేకా పిచ్చి చేష్టలపై సినిమా తీస్తా' - Sakshi

'ఆనం వివేకా పిచ్చి చేష్టలపై సినిమా తీస్తా'

మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పిచ్చి చేష్టలపై త్వరలో సినిమా తీయనున్నట్టు సినీ నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు.

నెల్లూరు : మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పిచ్చి చేష్టలపై త్వరలో సినిమా తీయనున్నట్టు సినీ నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల్లూరులోని రామ్‌నగర్‌లో ఉన్న స్థలంపై కమీషన్ కోసం వివేకా కావాలనే వివాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

2008లోనే మక్సూద్ అలీ వద్ద స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్లు కళ్యాణ్ చెప్పారు. అప్పట్లో ఆ స్థలం మైనార్టీల శ్మశానం అంటూ కొందరు కోర్టుకు వెళ్లగా.. అది తప్పని, ఆ స్థలం ప్రైవేటుదేనని కోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. రామ్‌నగర్‌కు కార్పొరేటర్‌గా, అప్పటి మేయర్‌గా కొనసాగిన భానుశ్రీకి తాను అక్కడ 100 అంకణాల స్థలం ఇచ్చినట్లు అప్పట్లో పత్రికల్లో కథనాలు వచ్చాయని, వాటిని వివేకా చూసి ఖండించాల్సిందిగా తనను ఆ రోజు కోరారన్నారు. ఆ రోజు 100 అంకణాల స్థలం ఇవ్వలేదని ఈ రోజు రాజకీయం చేస్తావా? అంటూ వివేకానుద్దేశించి కళ్యాణ్ ప్రశ్నించారు. వివేకాకు అధికారం పోయిన తర్వాత పిచ్చి పట్టిందని, అందువల్లే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement