పంజాగుట్ట పీఎస్లో లొంగిపోయిన సి.కల్యాణ్ | producer C.Kalyan surrenders panjagutta police station | Sakshi
Sakshi News home page

పంజాగుట్ట పీఎస్లో లొంగిపోయిన సి.కల్యాణ్

May 6 2015 2:12 PM | Updated on Sep 3 2017 1:33 AM

పంజాగుట్ట పీఎస్లో లొంగిపోయిన సి.కల్యాణ్

పంజాగుట్ట పీఎస్లో లొంగిపోయిన సి.కల్యాణ్

టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ బుధవారం హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.

హైదరాబాద్ : టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ బుధవారం హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మహిళపై దాడి చేసిన కేసులో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనపై చేయి చేసుకున్నారంటూ సి.కల్యాణ్ పై ఏప్రిల్ 28న  డాక్టర్ కవిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ ఫ్లాట్ విషయంలో తనను సి.కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.


కాగా మెట్రో రైలు నష్టపరిహారం నిమిత్తం  జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లో 11 ఫ్లాట్స్కు రూ.1.4 కోట్లు ఆమె చెల్లించింది. సి. కల్యాణ్ కూడా అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి సి.కల్యాణ్ ప్రత్యేక ఖాతా తెరవటంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు సంబంధించి తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని డాక్టర్ కవిత అర్థరాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సి. కల్యాణ్పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement