వెంకటేశ్వరుని ఆశీస్సులతో... | Naga Shourya New Film Launch | Sakshi
Sakshi News home page

వెంకటేశ్వరుని ఆశీస్సులతో...

Jun 24 2018 12:40 AM | Updated on Jun 24 2018 12:40 AM

Naga Shourya New Film Launch  - Sakshi

శంకర్‌ప్రసాద్, ఉషా బాల, నాగశౌర్య, ఆనందప్రసాద్, రాజా కొలుసు

‘ఛలో’ చిత్రంతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కారు నాగశౌర్య. ఆయన నటిస్తోన్న నూతన చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై రాజా కొలుసును దర్శకునిగా పరిచయం చేస్తూ వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిత్రం పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి.

ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌  మొదలుపెడతామని, మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే తెలియచేస్తామని ఆనందప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆనంద ప్రసాద్‌ సతీమణి కృష్ణకుమారి, హీరో నాగశౌర్య తల్లిదండ్రులు ఉషాబాల, శంకరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరాం, సంగీతం: సాగర్‌ మహతి, ఆర్ట్‌: వివేక్, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, కథ–స్క్రీన్‌ప్లే–మాటలు–దర్శకత్వం: రాజా కొలుసు.

Advertisement
 
Advertisement
Advertisement