ప్రతిరోజూ పండుగే | Naga Shourya Narthanasala Movie First Song Release | Sakshi
Sakshi News home page

ప్రతిరోజూ పండుగే

Aug 3 2018 5:02 AM | Updated on Aug 3 2018 5:02 AM

Naga Shourya Narthanasala Movie First Song Release - Sakshi

నాగశౌర్య, యామినీ భాస్కర్

‘ఛలో’ వంటి హిట్‌ తర్వాత ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాగశౌర్య హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర్‌ ప్రసాద్‌ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యామినీ భాస్కర్, కాష్మీర పరదేశీ కథానాయికలు.  ఈ నెల 30న సినిమా విడుదలవుతోంది. భాస్కర భట్ల రచించిన ‘ఎగిరే మనసు..’ అనే ఫుల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.  ఉషా ముల్పూరి మాట్లాడుతూ – ‘‘ఛలో’ చిత్రాన్ని మ్యూజికల్‌గానూ సూపర్‌ హిట్‌ చేశారు. ఈ సినిమాను కూడా అంతకు మించి సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

‘‘ఛలో’ సినిమాకు నిర్మాతలు దొరక్కపోవడంతో ఐరా క్రియేషన్‌ పుట్టింది. ఐరాకి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్, మీడియా, తమ్మిరాజు, చంటి నాలుగు పిల్లర్స్‌’’ అన్నారు శంకర్‌ ప్రసాద్‌.  ‘‘ఫస్ట్‌ లుక్‌ నుంచి మా సినిమాకు ఫుల్‌ సపోర్ట్‌ లభిస్తోంది. సినిమా స్టార్ట్‌ చేసినప్పుడు ఇంత పెద్దది అవుతుందనుకోలేదు. ప్రతిరోజూ షూటింగ్‌ పండుగలానే జరిగింది’’ అన్నారు శ్రీనివాస్‌ చక్రవర్తి. ‘‘ఛలో’లో ‘చూసీ చూడంగానే....’ సాంగ్‌ కంటే ఈ పాట పెద్ద సక్సెస్‌ అవ్వాలి’’ అన్నారు సంగీత దర్శకుడు సాగర్‌ మహతి. ‘‘నర్తనశాల’ అందరూ గుర్తుంచుకునే సినిమా అవుతుంది’’ అన్నారు యామినీ.

Advertisement
 
Advertisement
Advertisement