వైజాగ్‌ టు హైదరాబాద్‌

Naga Shaurya Gets Injured While Shooting For An Action - Sakshi

క్లాస్‌ హీరోగా కనిపించే నాగశౌర్య యాక్షన్‌ సీన్స్‌లో కూడా అదుర్స్‌ అనిపించగలరు. ‘ఛలో’ సినిమాలోని కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ మాస్‌ ఆడియన్స్‌కు కిక్‌ ఇచ్చాయి. ఈ కిక్‌ను మరింత అందించాలనే ఆలోచనలో ఉన్నారు నాగశౌర్య. అందుకు తగ్గట్లుగా తన తాజా చిత్రంలో రిస్కీ యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో మొదలైన ఈ సినిమా భారీ షెడ్యూల్‌ ముగిసింది.

ఈ షెడ్యూల్‌లోనే నాగశౌర్య కాలికి గాయమై షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. కొంచెం విరామం తీసుకున్న తర్వాత షూట్‌లో పాల్గొన్నారు నాగశౌర్య. ఈ షెడ్యూల్‌లో ఎక్కువగా యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘కేజీఎఫ్‌’ చిత్రానికి ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన అన్బు అరివు ఆథ్వర్యంలో యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top