-
వైజాగ్ టు హైదరాబాద్
క్లాస్ హీరోగా కనిపించే నాగశౌర్య యాక్షన్ సీన్స్‌లో కూడా అదుర్స్ అనిపించగలరు. ‘ఛలో’ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చాయి. ఈ కిక్‌ను మరింత అందించాలనే ఆలోచనలో ఉన్నారు నాగశౌర్య. అందుకు తగ్గట్లుగా తన తాజా చిత్రంలో రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో మొదలైన ఈ సినిమా భారీ షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్లోనే నాగశౌర్య కాలికి గాయమై షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కొంచెం విరామం తీసుకున్న తర్వాత షూట్లో పాల్గొన్నారు నాగశౌర్య. ఈ షెడ్యూల్లో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘కేజీఎఫ్’ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు ఆథ్వర్యంలో యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. -
నాకు స్ఫూర్తి ఆ ఇద్దరే – వెంకీ కుడుముల
‘‘నాది ఖమ్మం జిల్లా అశ్వరావుపేట. సినిమాలపై ఆసక్తితో రచయిత బలభద్రపాత్రుని రమణి ద్వారా తేజ గారి వద్ద ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. ఆ తర్వాత ‘అ ఆ’ సినిమాకు త్రివిక్రమ్‌గారి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశా. దర్శకులు త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ నాకు స్ఫూర్తి’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ‘ఛలో’ ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర ్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ –‘‘నాగశౌర్య ‘జాదూగాడు’ సినిమాకు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసా. నా వర్క్ నచ్చడంతో కథ రెడీ చేసుకురమ్మన్నారు శౌర్య. నేను వినిపించిన ‘ఛలో’ స్టోరీ ఆయనకు నచ్చడంతో సినిమా ప్రారంభమయ్యింది. నన్ను, నా కథను నమ్మి నాగశౌర్య పేరెంట్స్ ఈ సినిమా నిర్మించినందుకు వారికి నా కృతజ్ఞతలు. కన్నడ ‘కిరిక్ పార్టీ’ సినిమా చూశాక రష్మిక హీరోయిన్గా కరెక్ట్ అనిపించింది. నాగశౌర్యతో పాటు ఆయన పేరెంట్స్ కూడా ఓకే అనడంతో తనని తీసుకున్నాం. సంగీత దర్శకుడు సాగర్ మణిశర్మగారి అబ్బాయి అని అందరికీ తెలుసు. ‘జాదూగాడు’ టైమ్‌లో నాకు పరిచయమయ్యారు. ‘ఛలో’ సినిమాకు మంచి పాటలిచ్చారు. ఇప్పటి యువ దర్శకులపై త్రివిక్రమ్‌గారి ప్రభావం ఉంటుంది. అయితే ఆయన్ని అనుకరించకూడదు. సినిమా అవుట్‌పుట్ చూశాక టెన్షన్ లేదు. ‘ఛలో’ రిలీజ్ తర్వాత కొత్త సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభిస్తా’’ అన్నారు. -
సక్సెస్ గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నాం – నాగశౌర్య
‘‘సాయి శ్రీరామ్‌గారు ఇచ్చిన ధైర్యంతో మేం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాం. వెంకీ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. నిర్మాతలు మా తల్లిదండ్రులే. వారి గురించి పెద్దగా మాట్లాడలేను. అయితే నిర్మాతలుగా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘ఛలో’ సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘ఛలో’. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. కొత్త సంవత్సరం సందర్భంగా సినిమాలోని రెండో పాటను సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు, బీఏ రాజు విడుదల చేశారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘అసోసియేట్ డైరెక్టర్ని అయిన నేను ‘ఛలో’ సినిమాతో డైరెక్టర్‌గా మారాను. ఈ కొత్త ఏడాదిలో మంచి పేరున్న డైరెక్టర్ అవుతాననే నమ్మకం ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌కు మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరి 2న సినిమాని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’’ అన్నారు ప్రసాద్ మూల్పూరి. ‘‘కథ విన్నప్పుడే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పా. సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ రైట్స్‌తో పాటు, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడైపోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు సీనియర్ నరేశ్. పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్. -
హత్యకూ హోమానికి లింక్ ఏంటి?
గౌరవమే ఆస్తిగా భావించే కుటుంబం అది. కొత్తగా పెళ్లైన దంపతులు. అంతలోనే వాళ్లను ఓ మర్డర్ మిస్టరీ వెంటాడుతుంది. ఆపై హోమాలు. ఈ మర్డర్‌కి, హోమాలకీ సంబంధం ఏమిటి? ఈ పరిస్థితుల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడగలిగింది? అని తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు ‘కరు’ చిత్రబృందం. నాగశౌర్య, సాయి పల్లవి జంటగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళ, తెలుగులో రూపొందిన చిత్రం ‘కరు’. తెలుగులో ‘కణం’ పేరుతో విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాష్ కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘నాగశౌర్య, సాయి పల్లవి బాగా నటించారు. ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ విజయ్ ఈజ్ రెడీ టు గివ్ బర్త్’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. ప్రేమ్. -
తండ్రి మ్యూజిక్ బ్రహ్మ..కొడుకు మ్యూజిక్ ప్రిన్స్ – నాగశౌర్య
‘‘ఛలో’ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. రిలీజ్ చేసిన తొలి పాటకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సాగర్ మహతి చక్కటి సంగీతం అందించారు. సాగర్ తండ్రి మణిశర్మగారు మ్యూజిక్ బ్రహ్మ అయితే, సాగర్‌కి మ్యూజిక్ ప్రిన్స్ అని పేరు పెట్టాలనుకుంటున్నా’’ అన్నారు నాగశౌర్య. ఆయన హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముప్పలూరి సమర్పణలో ఉషా ముప్పలూరి నిర్మిస్తున్న సినిమా ‘ఛలో’. ఈ చిత్రం తొలి పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి మా అమ్మ, నాన్నలే నిర్మాతలు. నాకు నచ్చిన స్క్రిప్ట్‌ను నమ్మి, వారు ఈ సినిమా చేస్తున్నారు. కన్నడ హిట్ మూవీ ‘కిరిక్ పార్టీ’ రష్మిక మండన్నా చక్కగా నటించారు. సాయిశ్రీరామ్ ప్రతి సీన్‌ను అందంగా చూపించారు’’ అన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దు టైమ్‌లో నా కథ ఓకే చేశారు. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా అడిగిన దాని కంటే ఎక్కువగానే ఇచ్చారు నిర్మాతలు. సినిమా బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శంకర్ ప్రసాద్ ముప్పలూరి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement