నా తొలి యాక్షన్ మూవీ ఇది - నాగశౌర్య | my first action movie says Hero Nagasaurya | Sakshi
Sakshi News home page

నా తొలి యాక్షన్ మూవీ ఇది - నాగశౌర్య

Apr 22 2015 11:22 PM | Updated on Sep 3 2017 12:41 AM

నా తొలి యాక్షన్ మూవీ ఇది - నాగశౌర్య

నా తొలి యాక్షన్ మూవీ ఇది - నాగశౌర్య

నాగశౌర్య కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత దర్శకుడు యోగేశ్ చేసిన చిత్రం ఇది.

‘‘నాగశౌర్య కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత దర్శకుడు యోగేశ్ చేసిన చిత్రం ఇది. మంచి సినిమా తీసి ఉంటాడనే నమ్మకం ఉంది. ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమవుతున్న మణిశర్మ తనయుడు సాగర్ మహతికి శుభాకాంక్షలు’’ అని ‘ప్రసాద్స్’ సంస్థల అధినేత రమేశ్ ప్రసాద్ అన్నారు. నాగశౌర్య, సోనారిక జంటగా యోగేశ్ దర్శకత్వంలో వీవీయన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జాదూగాడు’. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న మణిశర్మ, బి.గోపాల్, కోన వెంకట్, గోపీచంద్ మలినేని, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా పాటల సీడీలను విడుదల చేశారు.
 
 ఇంకా ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న దామోదర ప్రసాద్, కల్యాణి మాలిక్, మెహర్ రమేశ్, నందినీరెడ్డి తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. లవర్‌బోయ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, తాను చేసిన తొలి యాక్షన్ మూవీ ఇదనీ, అందరూ ఆదరిస్తే కెరీర్‌పరంగా మరో మెట్టు ఎక్కుతాననీ ఈ సందర్భంగా నాగశౌర్య అన్నారు. మంచి సంగీత జీవితాన్ని ప్రసాదించిన మా నాన్నగారికి ధన్యవాదాలనీ, ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని సాగర్ మహతి చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement