కొత్త ప్రేమకథ | hero naga souya new movie started | Sakshi
Sakshi News home page

కొత్త ప్రేమకథ

Apr 1 2017 1:17 AM | Updated on Sep 5 2017 7:35 AM

కొత్త ప్రేమకథ

కొత్త ప్రేమకథ

హీరో నాగశౌర్య సొంత బ్యానర్‌ ఐరా క్రియేషన్స్‌ పతాకంపై వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్‌ ముల్పూరి ఓ చిత్రం

హీరో నాగశౌర్య సొంత బ్యానర్‌ ఐరా క్రియేషన్స్‌ పతాకంపై వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్‌ ముల్పూరి ఓ చిత్రం నిర్మించనున్నారు. కన్నడ భామ రష్మిక మండన్న కథానాయిక. సాగర్‌ మహతి సంగీత దర్శకుడు. చిత్రవిశేషాలను నిర్మాత శంకర ప్రసాద్‌ తెలియజేస్తూ– ‘‘మా అబ్బాయి నాగశౌర్యతో సినిమా నిర్మించాలని ఎప్పట్నుంచో ప్లాన్‌ చేస్తున్నాం. త్రివిక్రమ్‌ దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌ చేసిన వెంకీ కుడుముల చెప్పిన కథ నచ్చింది.

కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సరికొత్త ప్రేమకథా చిత్రం ఇది. మా సంస్థలో తొలి సినిమా కాబట్టి రాజీపడకుండా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్‌ 10న చిత్రాన్ని ఆరంభించాలను కుంటున్నాం’’ అని అన్నారు. ‘‘సినిమాలో నాగశౌర్య క్యారెక్టరైజేషన్‌ కొత్తగా ఉంటుంది. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో హస్య సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి’’ అని చిత్ర దర్శకుడు వెంకి అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సాయి శ్రీరామ్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement