కోఠిలో ‘శైలజారెడ్డి అల్లుడు’ సందడి.. | Naga chaitanyas Sailaja Reddy Alludu shooting begins | Sakshi
Sakshi News home page

కోఠిలో ‘శైలజారెడ్డి అల్లుడు’ సందడి..

Jan 19 2018 6:05 PM | Updated on Sep 27 2018 8:49 PM

Naga chaitanyas Sailaja Reddy Alludu shooting begins - Sakshi

సాక్షి, హైదరాబాద్: రారండోయ్‌ వేడుకచేద్దాం సినిమా విజయంతో దూసుకెళ్తున్న యంగ్ హీరో నాగచైతన్య, మహానుభావుడు సినిమా లాంటి సక్సెస్‌ తరువాత డైరెక్టర్‌ మారుతి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ షూటింగ్‌ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. గతంలో ‘కింగ్’ నాగార్జున హీరోగా వచ్చిన అల్లరి అల్లుడు సినిమాలా ఈ లేటెస్ట్ మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో నాగ్‌కు అత్తగా వాణీశ్రీ నటించగా, ‘శైలజారెడ్డి అల్లుడు’లో చైతూకి అత్తగా రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం.

చైతుకు జోడిగా అను ఇమాన్యుయేల్‌ నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని కోఠి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. డైరెక్టర్ మారుతి నుంచి ఆశించే కామెడీ ఈ సినిమాలో ఉంటుందని చిత్రయూనిట్‌ తెలిపింది. తమిళ హీరో మాధవన్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి నిధి అగర్వాల్ ‌(హిందీ మూవీ మున్నా మైఖేల్‌ ఫేం) టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. ‘ప్రేమమ్‌’ ప్రొడ్యుసర్ నాగవంశీ నిర్మిస్తుండగా.. నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం చందూ మొండేటి దర‍్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement