‘సవ్యసాచి’ రిలీజ్‌.. తాజా కబురు! | Naga Chaitanya Savyasachi Is Postponed To Release In July | Sakshi
Sakshi News home page

జూలైలో వస్తానంటున్న‘సవ్యసాచి’...?

May 5 2018 5:26 PM | Updated on Aug 29 2018 5:43 PM

Naga Chaitanya Savyasachi Is Postponed To Release In July - Sakshi

అక్కినేని అభిమానులు ఇప్పుడు ఆత్రంగా ఎదురుచూస్తున్నది నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రం విడుదల కోసమే. ‘ప్రేమమ్‌’ ఫేమ్‌ చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్‌లో విడుదలవుతుందనే వార్తలు వినిపించాయి ఇన్ని రోజులు. కానీ తాజా సమాచారం ఏంటంటే ‘సవ్యసాచి’ జూన్‌లో కాదు జులైలో వస్తున్నాడు. అయితే దీని గురించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇంతవరకూ సినిమా నిర్మాణానికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచారు చిత్ర యూనిట్‌. ఈ మధ్యే చిత్ర దర్శకుడు చందూ మొండేటి ‘సవ్యసాచి’ గురించి మాట్లాడుతూ నాగచైతన్యను ఇంతవరకూ ఎప్పుడు చూడని కొత్త పాత్రలో చూస్తారని, ‘సవ్యసాచి’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాడని తెలిపాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, మాధవన్‌, భూమిక ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్‌ ఎమ్‌ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement