ఆగస్టు 31న ‘శైలజా రెడ్డి అల్లుడు’

Naga Chaitanya Sailaja Reddy Alludu Release Date - Sakshi

యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకంటించారు. ఆగస్టు 31న శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని హీరో నాగచైతన్య తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. చైతూ సరసన అనూ ఇమ‍్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా గోపీసుందర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top