'వెనక్కి తగ్గను, రాజేంద్రుడికే మద్దతు' | naga babu support rajendra prasad | Sakshi
Sakshi News home page

'వెనక్కి తగ్గను, రాజేంద్రుడికే మద్దతు'

Mar 25 2015 5:07 PM | Updated on Sep 2 2017 11:22 PM

'వెనక్కి తగ్గను, రాజేంద్రుడికే మద్దతు'

'వెనక్కి తగ్గను, రాజేంద్రుడికే మద్దతు'

మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కే మద్దతు ఇస్తానని చిరంజీవి సోదరుడు నాగబాబు స్పష్టం చేశారు.

హైదరాబాద్: మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కే మద్దతు ఇస్తానని  చిరంజీవి సోదరుడు నాగబాబు స్పష్టం చేశారు. ఫలితాల గురించి తాము ఆలోచించడం లేదని ఆయన చెప్పారు. రాజేంద్రప్రసాద్ మనస్తత్వం, అనుభవం చూసే తనకు మద్దతు ఇచ్చానని బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు.

అసోసియేషన్ ను ప్రశ్నిస్తే బెదిరింపులుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు కోసం ఒక్కరు చాలని, రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలని కోరారు. కొత్తవాళ్లకు అవకాశమిద్దామని మురళీ మోహన్ చెప్పారని వెల్లడించారు. తామంతా రాజేంద్రప్రసాద్ ను అధ్యక్ష పదవికి ప్రతిపాదించామని, ఆయన పోటీ లేకుండా ఎన్నికవుతారని అనుకున్నామని చెప్పారు. అయితే తర్వాత జయసుధ పేరును తెరపైకి తెచ్చారని వాపోయారు.

రాజేంద్రప్రసాద్ కు మద్దతు ఇవ్వొద్దని, అతనికి అంత స్టేచర్ లేదని మురళీమోహన్ తనతో అన్నారని నాగబాబు తెలిపారు. రాజేంద్రప్రసాద్ అనుభవంపై తమకు నమ్మకముందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement