పేటలోకి ఎంట్రీ | Nadiya in Nithiin Power Peta | Sakshi
Sakshi News home page

పేటలోకి ఎంట్రీ

Jun 26 2020 3:57 AM | Updated on Jun 26 2020 3:57 AM

Nadiya in Nithiin Power Peta - Sakshi

నదియా

‘మిర్చి, అత్తారింటికి దారేది, అఆ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో క్యారెక్టర్‌ నటిగా కీలక పాత్రలు చేసి, మెప్పించారు నదియా. ఆమె మరో పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం. నితిన్‌ హీరోగా రూపొందనున్న ‘పవర్‌పేట’లో ఓ కీలక పాత్రకు నదియాని సంప్రదించారట. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిసింది.

‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రం తర్వాత హీరో నితిన్, దర్శకుడు కృష్ణచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ఇది. ఇందులో కీర్తీ సురేష్‌ కథానాయికగా నటించబోతున్నారని తెలిసింది. నటుడు సత్యదేవ్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారు. కథరీత్యా ఇందులో నితిన్‌ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. నితిన్‌ లుక్స్‌ కోసం హాలీవుడ్‌ మేకప్‌మేన్‌ని తీసుకోబోతున్నారట టీమ్‌. ఈ చిత్రం రెండు భాగాల్లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement