చచ్చిపోతాను.. కానీ ఇక్కడ కాదు! | naa peru surya naa illu india teaser release | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ టీజర్‌

Jan 1 2018 5:35 PM | Updated on Jan 1 2018 5:41 PM

naa peru surya naa illu india teaser release - Sakshi

సాక్షి, సినిమా : అల్లు అర్జున్‌ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫస్ట్‌ ఇంపాక్ట్‌ టీజర్‌ని కొత్త సంవత్సరం కానుకగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ‘నీకు సూర్యా అంటే సోల్జర్‌ కానీ ప్రపంచానికి సూర్య అంటే యాంగర్, ఇలాగే కొన్ని రోజులైతే చచ్చిపోతావు రా.. చచ్చిపోతా కానీ ఇక్కడ కాదు బార్డర్‌కి వెళ్లి చచ్చిపోతా’ లాంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. సైనికుడాగా అల్లు అర్జున్‌ నటన అందరిని ఆకట్టుకుంటుంది. 

ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ లు నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ స్వరాలందిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా నటిస్తున్నాడు. సీనియర్ నటుడు అర్జున్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది.

‘నా పేరు సూర్య’ టీజర్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement