‘నా సామిరంగ’ పాటల ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

‘నా సామిరంగ’ పాటల ఆవిష్కరణ

Published Wed, Sep 4 2013 1:41 AM

‘నా సామిరంగ’ పాటల ఆవిష్కరణ

‘‘దర్శకుడు కావాలన్న నా 18 ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరుతోంది. ఛాయాగ్రహణం, అగస్త్య సంగీతం ఈ చిత్రానికి మెయిన్ హైలైట్స్’’ అని దర్శకుడు సుబ్రహ్మణ్యం పచ్చా చెప్పారు. దిలీప్, సాయికుమార్, శ్రీతేజ్, ప్రియాంక, యశస్విని ముఖ్యతారలుగా సీహెచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి, జె.కృష్ణారెడ్డి, జీపీరెడ్డి నిర్మిస్తున్న ‘నా సామిరంగ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
 
 పాటల సీడీని ఆవిష్కరించిన అశోక్‌కుమార్ మాట్లాడుతూ -‘‘నా సామిరంగ’ అనే ఊతపదాన్ని టైటిల్‌గా పెట్టడం చాలా బావుంది’’ అన్నారు. ఇందులో పాటలన్నీ బావుంటాయని అగస్త్య తెలిపారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా చిర్రావూరి విజయ్‌కుమార్, కృష్ణచైతన్య, సాయి పంపన తదితరులు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
 
Advertisement