నా డాన్స్ అలా ఉండదట! | My dance was not like dance: Govinda | Sakshi
Sakshi News home page

నా డాన్స్ అలా ఉండదట!

Apr 30 2016 8:38 PM | Updated on Sep 3 2017 11:07 PM

నా డాన్స్ అలా ఉండదట!

నా డాన్స్ అలా ఉండదట!

తాను డాన్స్ వేస్తే చూసేవాళ్లకు డాన్స్ చేస్తున్నట్టుగా అనిపించదని అందరూ అంటుంటారని బాలీవుడ్ నటుడు గోవింద వ్యాఖ్యానించాడు.

ముంబై: తాను డాన్స్ చేస్తుండగా చూసేవాళ్లంతా డాన్స్ చేస్తున్నట్టుగా అనిపించదని అందరూ అంటుంటారని బాలీవుడ్ నటుడు గోవింద వ్యాఖ్యానించాడు. డాన్స్లో తనదైన శైలీలో కొత్తదనాన్ని ప్రదర్శించగల నైపుణ్యం ఉన్న గోవింద.. సినీ పరిశ్రమలో నటుడిగా అద్భుతంగా రాణించాడు. డాన్స్ పట్ల తనకు ఉన్న మక్కువను  ప్రస్తావించాడు. కోరియోగ్రాఫర్ సందీప్ సోపార్కర్ నిర్వహించిన '3వ ఇండియా డాన్స్ వీక్' లో పాల్గొన్న సందర్భంగా గోవింద మీడియాతో ముచ్చడించాడు. డాన్స్ చేయడంలో చాలామందికి చాలా రకాల యాంగిల్స్ తెలిసి ఉండొచ్చు. కానీ ఇకముందు డాన్స్ లోనూ కొత్త రూపాలు సంతరించుకోనున్నాయని చెప్పాడు.

డాన్స్ చేయడం వల్ల కేవలం ఆరోగ్యమే కాదు.. మంచి వినోదం కూడా. డాన్స్లో ప్రదర్శించే యాంగిల్స్తో మనం ఎన్నో కొత్త విషయాలను సృష్టించవచ్చనన్నాడు. ప్రపంచంలో అందరూ తొలుత లేవగానే వ్యాయామం చేస్తుంటారు. అయితే ప్రాణాయం అనేది డాన్స్ నుంచే ఉద్భవించిందన్నాడు. స్ట్రీట్ డాన్సర్గా తన జీవితాన్ని ప్రారంభించిన గోవింద.. డిస్కో డాన్స్లతో దుమ్మురేపి నెంబర్ వన్ హీరో స్థాయికి చేరుకున్నాడు. కాగా, ఇటీవల బాలీవుడ్లో విడుదలైన పలు సినిమాలు 'కిల్ దిల్' హ్యాపీ ఎండింగ్' వంటి చిత్రాల్లో అద్భుతమైన డాన్స్తో ప్రేక్షకులను అలరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement